Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) కాన్సెప్ట్ నవ గ్రహాలు అని ఏదేదో ప్రోమోస్ లో చూపించారు. కానీ అసలు కాన్సెప్ట్ ఏంటంటే సామాన్యులకు మరియు సెలబ్రిటీలకు మధ్య యుద్ధం. చివరికి గ్రాండ్ ఫినాలే లో నాగార్జున(Akkineni Nagarjuna) చేతుల మీదుగా సామాన్యుడు కప్ ని అందుకుంటాడా?, లేదా సెలబ్రిటీ కప్పుని అందుకుంటాడా అనేదే ఆసక్తికరమైన పాయింట్. అయితే ఆడియన్స్ ఓటింగ్ మొదటి నుండి సామాన్యులకు అనుకూలంగా ఉంటుంది. పైగా ఈసారి సామాన్యులు మామూలుగా రావడం లేదు, ‘అగ్నిపరీక్ష’ అనే షో ద్వారా భారీ ఫ్యాన్ బేస్ తో హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. కాబట్టి మొదటి ఎపిసోడ్ నుండే ఓటింగ్ లో వీళ్ళ డామినేషన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సీజన్ కి వచ్చి నెగిటివ్ అయ్యి బయటకు వెళ్లడం తప్ప మరొకటి లేదు అనే ఉద్దేశ్యంతో చాలా మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడానికి భయపడ్డారు.
ఎందుకంటే 7వ తాలూకు భయాలు ఇంకా పోలేదు. ఆ సీజన్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డని అంటూ హౌస్ లోపలకు అడుగుపెట్టాడు. సోషల్ మీడియా లో అప్పట్లో హౌస్ లో ఉన్న వాళ్లందరికంటే ఇతను టాప్ సెలబ్రిటీ. కానీ కామన్ మ్యాన్ అనే ముసుగు తో హౌస్ లోపలకు వచ్చాడు. మొదట్లో ఇతను చేసే పనులు చాలా వింతగా అటెన్షన్ కోసమే చేస్తున్నట్టు అనిపించేవి. దానిని అమర్ దీప్ అనే కంటెస్టెంట్ నిలదీసే ప్రయత్నం చేసి ఘోరమైన నెగిటివిటీ ని మూటగట్టుకున్నాడు. అప్పటి వరకు కచ్చితంగా ఇతనికి టైటిల్ దక్కుతుంది అనే ఊపు ఉండేది. కానీ ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ అనే సామాన్యుడిని టార్గెట్ చేసాడు అనే జనాల్లో ముద్ర పడిందో , అప్పటి నుండి నెగిటివిటీ ని సంపాదించుకొని టైటిల్ కొట్టాల్సిన వాడు కాస్త రన్నర్ గా నిలిచాడు. ఈ ఉదాహరణని తీసుకొని ఒక యంగ్ హీరో సామాన్యులకు భయపడి ఈ సీజన్ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు.
ఆ హీరో మరెవరో కాదు, ముకేశ్ గౌడ(Mukesh Gowda). స్టార్ మా ఛానల్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ‘గుప్పెడంత మనస్సు’ సీరియల్ హీరో ఇతను. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ లో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఒక సినిమాలో హీరో గా కూడా నటించాడు. ఇతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తే మంచి రేటింగ్ వస్తుందని ఇతని కోసం బిగ్ బాస్ టీం చెయ్యని ప్రయత్నం అంటూ ఏది మిగలలేదు. కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేశారు, అదే విధంగా స్టార్ మా ఛానల్ లో వరుసగా మూడు సీరియల్స్ లో హీరో గా నటించే అవకాశం కూడా ఇస్తామని చెప్పారు, కానీ ఆయన మాత్రం సామాన్యులు ఉంటే నేను రాను అని తెగేసి చెప్పాడు. ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా అతని నుండి ఇదే సమాధానం వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన స్థానం లోకి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారిన అంశం.