Sabarimala controversy: ఒకదాని కోసం వెళితే ఇంకొకటి వచ్చింది. పినరయి విజయన్ భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకుందామని ఒక పథకం వేశాడు. తన కొరివితో తన తలనే గోక్కుంటున్నట్టు అయ్యింది. మొదట్లో చిన్నగా ఉండి ఇప్పుడు ఇది గాలివానలా మారింది.
సుప్రీంకోర్టు గతంలో అందరి మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆదేశించింది. దీనిపై కోర్టు కేరళ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనికి పినరయి విజయన్ ప్రభుత్వం అందరి భక్తులకు ప్రవేశం కల్పించాలని అఫిడవిట్ వేసింది. దీనిపై అయ్యప్ప భక్తులు భగ్గుమన్నారు..
తనంతట తానే ఇప్పుడు ఈ వివాదాన్ని కెలుక్కున్నారు. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్వామి అయ్య ప్ప భక్తుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుందామని.. ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ అంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దానికి ముఖ్య అతిథిగా తమిళనాడు సీఎం స్టాలిన్ ను పిలిచాడు. ఈ ఇద్దరు సీఎంలకు అసలు దేవుడిపై నమ్మకం లేదు. ఇద్దరు నాస్తికులే. నాస్తికులు అయ్యప్ప సమావేశం జరుపుతారు.
భక్తులకు నాస్తికులకు మధ్య రాజుకుంటున్న శబరిమల వివాదంపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
