spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8 : 'బిగ్ బాస్ 8' తొలి కంటెస్టెంట్ అయిన...

Bigg Boss Telugu 8 : ‘బిగ్ బాస్ 8’ తొలి కంటెస్టెంట్ అయిన ఈ యష్మీ గౌడ ఎవరు..? ఈమె ప్రేమ వ్యవహారం బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు!

Bigg Boss Telugu 8 : నేడు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లోనే ఎన్నో ట్విస్టులు అటు ప్రేక్షకులను, ఇటు కంటెస్టెంట్స్ ని షాక్ కి గురి చేసాయి. మొదటి రోజే ఈ సీజన్ లో కెప్టెన్ ఉండరని, రేషన్ ఉండదని నాగార్జున తేల్చి చెప్పేసాడు. కాఫీ కావాలన్నా కూడా టాస్కులు ఆడి గెలిచి సంపాదించుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధమైన ట్విస్టులు ఈ సీజన్ లో అనంతంగా ఉండబోతున్నాయి. ఇకపోతే ఈ సీజన్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన యష్మీ గౌడ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి తెలుగు ఆడియన్స్ కి ‘నాగ భైరవి’ అనే సీరియల్ ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. జీ తెలుగు లో ప్రసారమైన ఈ సీరియల్ అప్పట్లో పెద్ద హిట్. యష్మీ గౌడ కి మంచి పేరుని తీసుకొచ్చింది.

ఈ సీరియల్ తర్వాత జీ తెలుగులో ప్రసారమయ్యే పలు ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఈమె హోస్ట్ గా కూడా వ్యవహరించింది. చూడచక్కని అందంతో కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టే ఈమెకి సోషల్ మీడియా లో మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఇక రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బ్లాక్ బస్టర్ సీరియల్ ‘కృష్ణ ముకుంద మురారి’ లో మెయిన్ విలన్ గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈమె విలనిజం కి విపరీతమైన నెగటివిటీ రావడంతో ఆ సీరియల్ నుండి మధ్యలోనే తప్పుకుంది. ఆ రేంజ్ లో ఆమె నటించింది అన్నమాట. ఈ సీరియల్ తర్వాత జీ తెలుగు లో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్ గా నిల్చింది. జెమినీ టీవీ లో ప్రసారమైన ‘అను అనే నేను’ సీరియల్ లో కూడా ఈమె విలన్ గా నటించింది. అలా హీరోయిన్ గా, విలన్ గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన యష్మీ గౌడ, సీరియల్ హీరో నిఖిల్ జోడిగా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటి తనంతో మాట్లాడే ఈమె కారణంగా బోలెడంత కంటెంట్ వస్తుందని చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో హీరోయిన్ గా చేసిన ప్రేరణ కూడా ఈ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

ఇలా ఒకే సీరియల్ లో హీరోయిన్ గా, విలన్ గా చేసిన వీళ్లిద్దరి మధ్య హౌస్ లో కూడా అలాగే ఉంటుందా?, లేదా మంచి స్నేహితులుగా ముందుకు సాగుతారా అనేది చూడాలి. అయితే యష్మీ గౌడ లో ప్రేక్షకులందరికీ ఆమె నిజాయితీగా మాట్లాడడం బాగా నచ్చింది. తనకి గతంలో ఒక లవ్ స్టోరీ ఉండేదని, కొన్ని సంఘటనల కారణంగా అది బ్రేక్ అయ్యిందని, అందుకు నేనే కారణమని, నా మూడ్ స్వింగ్స్ తట్టుకోలేక నా బాయ్ ఫ్రెండ్ వదిలేసాడని, తప్పు నాదే అని ఒప్పుకుంది. అంతే కాదు ఈమె అబద్దాలు కూడా బాగా ఆడుతుందట, ఇలా ఒక కంటెస్టెంట్ తనలోని నెగటివ్ యాంగిల్స్ ని ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేదు. మొదటి రోజే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన ఈమె ప్రవర్తన రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Oktelugu Epaper