Rana Daggubati: స్టార్ హీరోలు ఏం చేసినా.. చేయకపోయినా.. సినీ ఇండస్ట్రీలో న్యూసే అవుతుంది. రెగ్యులర్ గా కనిపించి ఒక్కసారిగా మాయమైపోతే అతని గురించి రకరకాలుగా చర్చించుకుంటూ ఉంటారు. తాజాగా దగ్గుబాటి హీరో రానా గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. కొన్ని నెలులుగా రానా సినిమాల్లో తగ్గించడం మానేశారు. ఆయన చివరిసారిగా ‘విరాట పర్వం’ సినిమాలో హీరోగా వచ్చి ఆ తరువాత మరే సినిమాలో కనిపించడం లేదు. ఈ తరుణంలో రానా ఏమైపోయాడంటూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే రానా తండ్రి కాబోతున్నాడా? అని కొందరు కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారు.
కరోనా కాలంలో రానా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన మిహిక ను వివాహం చేసుకున్నారు. అంతకుముందే లవ్లో ఉన్న వీరు పెద్దలను ఒప్పించి చాలా కొద్ది మంది మధ్య ఒక్కటయ్యారు. అప్పటి నుంచి రానా సినిమాల్లో కనిపించడం తక్కువైంది. రానా పెళ్లి చేసుకున్న తరువాత కేవలం రెండు, మూడు సినిమాల్లో మాత్రమే కనిపించారు. ఆ తరువాత ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీసులో కనిపించారు. ఇందులో ఆయన బాబాయ్ వేంకటేష్ కూడా ఉన్నారు.
ఈ తరుణంలో రానా తండ్రి కాబోతున్నాడా? అందుకే సినిమాల్లో నటించడం తగ్గించాడా? అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. వాస్తవానికి సోషల్ మీడియా పోస్టులను రానా పట్టించుకోరు. దీంతో ఈ పోస్టులు నిజమే కావొచ్చని మరిన్ని పోస్టులు పెట్టారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతుండడంతో ఆయన సతీమణి మహికా స్పందించారు. మీరనుకున్నట్లు అదే కాదని తెలిపారు.
తాను ప్రస్తుతం గర్భవతిని కాదని తేల్చి చెప్పింది. వెంటనే రానా కూడా రంగంలోకి దిగి మిహికాకు తోడు ఉండాలనే ఉద్దేశంతోనే సినిమాల్లో నటించడం తగ్గించానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ సస్పెన్స్ కు తెరపడింది. అయితే బాహుబలి తరువాత రానా ఏ సినిమాలో కనిపించినా ఆకట్టుకోవడం లేదని అంటున్నారు. ఆయనకు మంచి పాత్ర ఇవ్వాలని కోరుతున్నారు. మరి రానా నెక్ట్స్ ఏ మూవీలో కనిపిస్తాడో చూడాలి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Thats why rana daggubati movies are reduced shocking reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com