Homeక్రీడలుIPL 2023 Last Over: మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్న ఆ ఓవర్

IPL 2023 Last Over: మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్న ఆ ఓవర్

IPL 2023 Last Over: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళుతుండడంతో అభిమానులు క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు వస్తుండడంతో మ్యాచ్ పూర్తిగా టర్న్ అవుతోంది. ఈ ఏడాది ఐపిఎల్ లో ఎక్కువ మ్యాచ్ లు ఇలానే జరుగుతుండడంతో చివరి దశలో మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అవుతోంది. అప్పటి వరకు గెలుస్తుందనుకున్న టీమ్ ఓటమి పాలు కావాల్సి వస్తోంది.

టి20 ఫార్మాట్ లో ప్రతి ఓవర్ ఎంతో కీలకంగా ఉంటుంది. ఏ ఒక్క ఓవర్ లయ తప్పిన బంతులేసినా, అంతకు ముందు ఓవర్ గొప్పగా వేసిన ఓవర్లన్నీ గాల్లో కలిసిపోతాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రన్సు లీక్ చేయకుండా బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఈ సీజన్ ఐపీఎల్ లో ఒక్క ఓవర్ కారణంగా అనేక జట్లు మ్యాచులు ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, గత రెండు మ్యాచ్ ల్లో 19 ఓవర్ లోనే మ్యాచ్ టర్న్ కావడం ఆసక్తిని కలిగిస్తోంది.

కీలక బౌలర్లకు అప్పగించినప్పటికీ..

సాధారణంగా చివరి రెండు ఓవర్లను జట్టులోని కీలక బౌలర్లకు ఉంచుతారు. కొంత మంది కెప్టెన్లు చేజింగ్ లో 19 వ ఓవర్ ను ప్రధాన బౌలర్ కు ఇస్తారు. మరి కొంత మంది కెప్టెన్లు అయితే చివరి ఓవర్ ను ప్రధాన బౌలర్ కు అందిస్తారు. అప్పట్లో ముంబై ఇండియన్స్ కు మాత్రమే ఈ లెక్కతో పని ఉండేది కాదు. ఎందుకంటే రోహిత్ జట్టుకు చివరి రెండు ఓవర్లు బుమ్రా, మలింగ వేసేవారు. ఇందులో ఎవరికి ఏ ఓవర్ ఇచ్చినా ఒకటే. అయితే మిగిలిన జట్లకు అంత లక్ ఉండేది కాదు.

అభిమానులకు కిక్ ఇస్తున్న చివరి ఓవర్లు..

ఈ ఏడాది ఐపీఎల్ లో అనేక మ్యాచులు చివరి ఓవర్ వరకు వెళుతుండడంతో అభిమానులకు మంచి కిక్ వస్తోంది. మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులు ఉత్సాహ పరిచింది. చివరి బంతి నో బాల్ కావడం, ఆ తరువాత ఫ్రీ హిట్ లో సమద్ సిక్సు కొట్టడంతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు విజయం సాధించడం అభిమానులకు ఇప్పటికీ కలలాగే ఉంది. ఈ మ్యాచ్ లో 19 ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. 12 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో.. చివరి ఓవర్ కు 17 పరుగులు చేయాల్సిన పరిస్థితికి మారిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ 19 వ ఓవర్ లో రెచ్చిపోవడంతో ఆ ఓవర్ లోనే మ్యాచ్ పూర్తిగా హైదరాబాదు వైపు టర్న్ అయింది.

కోల్కతా మ్యాచ్ లోనూ అంతే..

ఇక సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లోను ఇటువంటిదే పునారావృతమయింది. 19 ఓవర్ లోనే కోల్కతా జట్టు వైపు మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. 12 బంతులకు 26 పరుగులు కావాల్సిన దశలో.. పంజాబ్ బౌలర్, ఇంగ్లాండ్ సంచలన ప్లేయర్ సామ్ కర్రాన్ ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. సామ్ కర్రాన్ వేసిన ఈ ఓవర్ లో రస్సెల్ రెచ్చిపోయి హిట్టింగ్
చేశాడు. ఏకంగా మూడు సిక్సలు బాదడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. 20వ ఓవర్ లో ఆరు బంతుల్లోనే ఆరు పరుగులు చేస్తే గెలిచే స్థితిలోకి కోల్కతా నైట్ రైడర్స్ చేరిపోయింది. ఇలా వరుస పెట్టి రెండు మ్యాచ్ల్లోనూ చేజింగ్ టీమ్ 19 వ ఓవర్లోనే మ్యాచ్ ను టర్న్ చేసుకుని విజయాలు సాధించడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular