Prabhas , Bhagyashree Bhorse
Prabhas : కొంతమంది హీరోయిన్లకు అదృష్టం మామూలు రేంజ్ లో ఉండదు. మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ తమకు ఉన్న అందం కారణంగా వరుసగా అవకాశాలను సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు భాగ్యశ్రీ భోర్సే(Bhagyashree Borse). ఈమె మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) హీరో గా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై రవితేజ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఈ చిత్రం పై అంతటి అంచనాలు ఏర్పడడానికి కారణం కూడా ఈమెనే. పోస్టర్స్ లో, సాంగ్స్ లో అందాల అరబోయడంతో ప్రేక్షకులు కనీసం ఈమెకు అయినా ఒకసారి సినిమా చూడాలి అని అనుకున్నారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే వరుసగా రెండు సినిమాలకు అడ్వాన్స్ తీసుకుంది. అందులో ఒకటి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie).
తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ ని అడిగిమరీ తన సినిమాలో పెట్టుకున్నాడు. ఈ సినిమాతో పాటు ఆమె రామ్ పోతినేని(Ram Pothineni) తో మరో సినిమా కూడా మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే కమిట్ అయ్యింది. ఈ చిత్రానికి దర్శకుడు పీ.మహేష్ బాబు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), ప్రశాంత్ వర్మ(Prasanth Varma) కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ప్రభాస్ మొట్టమొదటిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన లుక్ టెస్ట్ ని నేడు నిర్వహించారు. ప్రభాస్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కూడా లుక్ టెస్ట్ లో పాల్గొన్నట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
Also Read : ప్రభాస్ మరో కొత్త సినిమా రేపే మొదలు..అభిమానులకు ఊహించని ట్విస్ట్..డైరెక్టర్ ఎవరంటే!
మొదటి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ, వరుసగా సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ, ఇప్పుడు ఏకంగా రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిందంటే సాధారణమైన విషయం కాదు. ఈ చిత్రానికి ఆమె ఏకంగా ఆరు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట. ఇది చిన్న విషయం కాదు, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోవడం లేదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఆమె కేవలం 5 కోట్ల రేంజ్ లోనే రెమ్యూనరేషన్ అందుకుంది. అలాంటిది భాగ్యశ్రీ కేవలం ఒక్క సినిమా విడుదల తోనే ఆరు కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకునే హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక్కడి నుండి ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతే కచ్చితంగా ఆమె పెద్ద రేంజ్ కి వెళ్లొచ్చు. పాన్ ఇండియా లెవెల్ లో చక్రం తిప్పొచ్చు. చూడాలి మరి ఆ లెవెల్ కి వెళ్తుందా లేదా అనేది.
Also Read : ప్రభాస్ తో సినిమాకు సిద్ధం అయిన స్టార్ డైరెక్టర్…కానీ డేట్స్ విషయం లో క్లారిటీ లేదు…