https://oktelugu.com/

Posani Krishna Murali: పోసాని కి జైల్లో తీవ్ర అస్వస్థత..హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన పోలీసులు..ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!

రాజంపేట సబ్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న పోసాని కృష్ణ మురళి కి స్వల్ప అస్వస్థత ఏర్పడినట్టు తెలుస్తుంది. నిజానికి గత కొంతకాలం నుండి ఆయన గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు.

Written By: , Updated On : March 1, 2025 / 05:55 PM IST
Posani Krishna Murali (3)

Posani Krishna Murali (3)

Follow us on

Posani Krishna Murali: కులాల మధ్య చిచ్చు పెట్టే విధమైన వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ సినీ రచయత, వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రైల్వే కోడూరు కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన బెయిల్ కి సంబంధించిన విచారణను సోమవారానికి వాయిదా వేసిన కోర్టు తీర్పు పై వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజంపేట సబ్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న పోసాని కృష్ణ మురళి కి స్వల్ప అస్వస్థత ఏర్పడినట్టు తెలుస్తుంది. నిజానికి గత కొంతకాలం నుండి ఆయన గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. అందుకే ఈమధ్య కాలం లో సినిమాలను పూర్తిగా తగ్గించేసాడు. రాజకీయాలకు కూడా దూరం అయిపోయాడు. నిన్న పోసానికి తీవ్ర స్థాయిలో విరోచనాలు అవ్వడంతో ఆయన్ని వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు.

Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు

అక్కడ ఆయనకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్ట్స్ లో పోసాని ఆరోగ్యం లో స్వల్ప తేడా, మార్పులు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్స్ కి తరలించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. మరోపక్క వైసీపీ పార్టీ సోషల్ మీడియా కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణ మురళి పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల అభిమానులు మాత్రం పోసాని కృష్ణ మురళి గతంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), చంద్రబాబు(CM Chandrababu Naidu), లోకేష్(Nara Lokesh) లపై అతి నీచంగా మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదలకుండా శాపనార్దాలు పెట్టడం వంటి వీడియో లు చూపించి ఇలాంటి నీచుడికి వైసీపీ పార్టీ సపోర్టు చేస్తుంది, ఇతన్ని సపోర్టు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే పోసాని కి ఒకవేళ సోమవారం రోజున బెయిల్ వస్తే, మరో నాలుగు కేసులు ఆయనపై వేసి మళ్ళీ అరెస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు పోలీసులు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 17 కేసులు నమోదు అయ్యాయి. కాబట్టి ఇప్పట్లో ఆయన బయటకి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు సినిమాల్లో రచయితగా, దర్శకుడిగా, కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను, అభిమానాన్ని అందుకున్న పోసాని కృష్ణ మురళి , అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి, జగన్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు నోటికి హద్దు, అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేసి ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు అంటూ ఆయనపై సానుభూతి చూపేవాళ్లు కూడా ఉన్నారు. అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను అలా బూతులు మాట్లాడాల్సి వచ్చిందని రిమాండ్ రిపోర్టు లో పోసాని కృష్ణ మురళి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

Also Read: రెండు హిట్స్ తో అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసిన ‘డ్రాగన్’ హీరో ప్రదీప్ రంగనాథన్..ఏకంగా ధనుష్ ని దాటేశాడుగా!