Pradeep Ranganathan
Pradeep Ranganathan : టాలెంట్ ఉంటే ఎంత ఎత్తుకి అయిన ఎదగొచ్చు, ఎవరి అండ అవసరం లేదు అని నిరూపించిన కుర్ర హీరోలలో ఒకరు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఇతను మన తెలుగు ఆడియన్స్ కి ‘లవ్ టుడే'(Love Today), ‘డ్రాగన్'(Dragon Movie) వంటి చిత్రాలతో బాగా సుపరిచితమైన సంగతి తెలిసిందే. తమిళనాడు లోని SSN ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ, తీరిక సమయాల్లో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తూ ఉండేవాడు. మొదటి నుండి ఇతనికి గొప్ప ఫిలిం మేకర్ అవ్వాలని కోరిక ఉండేది. సినిమాల్లోకి ఎలా వెళ్లాలో మార్గం తెలియక, ఇలా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యే ప్రయత్నాలు చేసాడు. ఇతని షార్ట్ ఫిలిమ్స్ ని చూసి బాగా మెచ్చుకున్న ప్రముఖ కోలీవుడ్ హీరో జయం రవి తనకు దర్శకత్వం వహించే అవకాశం అందించాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కోమలి’ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘లవ్ టుడే’ చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు. ఈ సినిమాలో ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయన లిరికల్ రైటర్ కూడా. 2022 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ కుర్రాడు వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్’ మొదటి సినిమాకంటే పెద్ద హిట్ అయ్యింది. కేవలం వారం రోజుల్లోనే 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. ఈ రెండు సినిమాలు తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యాయి.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ని కొట్టేసిన తమిళ యంగ్ హీరో..మండిపడుతున్న ఫ్యాన్స్!
దీంతో అటు తమిళంలోనూ, ఇటు తెలుగు లోనూ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. మొదటి రెండు సినిమాలతో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొట్టడం అంత తేలికైన విషయం కాదు. అందుకే ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి చిత్రాలకు 20 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమెనునేరషన్ ని డిమాండ్ చేస్తున్నాడట. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం ధనుష్, శింబు వంటి హీరోలు కూడా అందుకోవడం లేదు. తొలి రెండు సినిమాలతోనే వాళ్ళిద్దరినీ దాటేసాడంటే చిన్న విషయం కాదు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈయన ఇదే తరహా సినిమాలు తీస్తూ పోతే యూత్ ఐకాన్ గా కూడా మారిపోవచ్చు. ఎందుకంటే ఈ జోన్ లో ఈమధ్య కాలంలో ఏ హీరో కూడా సినిమాలు చేయడం లేదు కాబట్టి, ఆ గ్యాప్ ని ప్రదీప్ ఫిల్ చేయొచ్చు.
Also Read : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు..ఎందులో చూడాలంటే!