Heroines : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు…ఇక వైవిధ్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేసి వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి… ఈ మధ్యకాలంలో పాన్ ఇండియాలో సినిమాలు చేస్తు తెలుగు స్థాయిని పెంచడమే కాకుండా వాళ్ల స్టార్ డమ్ ను కూడా విస్తరించుకునే ప్రయత్నంలో తెలుగు సినిమా డైరెక్టర్లు ఉండడం విశేషం…
సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న అవకాశం వస్తే చాలు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొంతమందికి అవకాశం వచ్చినప్పటికీ వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకోలేక పోతారు. ఇక మరి కొంతమంది మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి అవకాశాలనైతే ఇస్తుంది. కానీ స్టార్లుగా మార్చలేదు అనేది మాత్రం వాస్తవం…ఇక్కడ టాలెంట్ ఉన్నవారు మాత్రమే ఎక్కువ రోజులు పాటు తమ మనుగడను కొనసాగిస్తారు… ఇక ఇదిలా ఉంటే హీరోయిన్ల పరిస్థితి అయితే మరి దారుణం…చాలామంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలనే కలతో ఇండస్ట్రీ కి వచ్చి మోసగాళ్ళ చేతిలో పడి మోసపోయి అవకాశాలు రాక ఇంటికి వెళ్లలేదా కృంగి కుషించి పోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక స్టార్ ప్రొడ్యూసర్ చాలామంది హీరోయిన్లను వాడుకుంటూ ఆయన చేసే సినిమాల్లో వాళ్లకి అవకాశాలైతే ఇస్తున్నాడు. ఇక ఆ స్టార్ ప్రొడ్యూసర్ కి మరొక స్టార్ డైరెక్టర్ ఈ విషయంలో హెల్ప్ చేస్తున్నాడు. ముందుగా ఆ అమ్మాయిలను తను వాడుకుంటూ ప్రొడ్యూసర్ దగ్గరికి కూడా పంపిస్తున్నాడు అనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి.
ఆ ప్రొడ్యూసర్, దర్శకుడు ఎవరు అనే విషయం పక్కన పెడితే చాలా మంది హీరోయిన్లు వీళ్ళ బారిన పడి ఇండస్ట్రీలో కొద్ది రోజుల పాటు సక్సెస్ అయినప్పటికి ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇతర భాషల నుంచి వచ్చే హీరోయిన్లకు వీళ్ళు వలవేసి పట్టుకుంటున్నారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆ ప్రొడ్యూసర్ కి అమ్మాయిలు కావాలి, ఈ దర్శకుడికి అవకాశాలు కావాలి.
అందువల్లే వీళ్ళు వరుసగా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారనే చెప్పాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటి వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఎవరు కూడా బయటకు వచ్చి మేము ఇలాంటివి ఎదుర్కొంటున్నాం అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.
కొంతమంది బయటికి వచ్చినప్పటికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళ నోరు మూయించే ప్రయత్నమైతే చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సైతం ఇలాంటి వాటి వల్ల భయపడిపోతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…మరి ఇలాంటి వారికి బుద్ధి చెప్పే వారు ఇండస్ట్రీ లో ఎవరు లేరా అనే ధోరణిలో కూడా ప్రశ్నలు తలెత్తతున్నాయి…