Thammudu Achyuth Actor: సీరియల్ హీరో గా మన చిన్నప్పుడు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన అతి తక్కువ మంది ఆర్టిస్టులలో ఒకరు అచ్యుత్(Actor Achyuth). చూసేందుకు ఎంతో అందంగా కనిపించే ఈయనకు, సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆ రోజుల్లోనే సినిమా అవకాశాలు క్యూలు కట్టేవి. ముఖ్యంగా ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన 5వ చిత్రం ‘తమ్ముడు’ లో పవన్ కి అన్నయ్య గా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్, అచ్యుత్ అన్నదమ్ములు అంటే అందరూ నమ్మేసేవారు. హెయిర్ స్టైల్, ఫేస్ కట్ దాదాపుగా అలాగే ఉండేవి. తమ్ముడు చిత్రానికి ముందు కూడా ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. తమ్ముడు తర్వాత నరసింహా నాయుడు, కలిసుందాం రా, మురారి, డాడీ, వాసు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.
Also Read: వారం కాకముందే ఓటీటీ లోకి ‘కింగ్డమ్’..ఎందులో చూడాలంటే!
అంతే కాదు ఈయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవాడు. ఆరోజుల్లో ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సపోర్టుగా ఉండేవాడు. ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారాలు కూడా చేసేవాడు. అలా ఎంతో చురుగ్గా ఉండే అచ్యుత్ 2002 వ సంవత్సరం లో తన 41 వ ఏటా గుండెపోటు తో మరణించాల్సి వచ్చింది. చిన్న వయస్సు లో ప్రాణాలు కోల్పోయాడు, టాలీవుడ్ కి ఒక మంచి నటుడు దూరం అయ్యాడు అంటూ అప్పట్లో అందరూ బాధపడేవారు. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగానే అందరూ జీవిస్తున్నారు. అయితే అచ్యుత్ కి ఒక సోదరుడు ఉన్నాడు. రక్తం పంచుకొని పుట్టుకపోయినా కూడా, సొంత సోదరుడిగానే అతన్ని ట్రీట్ చేసేవాడు. అతను మరెవరో కాదు ప్రదీప్. ప్రదీప్ అంటే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న యాంకర్ ప్రదీప్ కాదు, నటుడు ప్రదీప్.
Also Read: 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘కింగ్డమ్’ వసూళ్లు..ఎంత వచ్చిందంటే!
ఈయన ఒకప్పుడు హీరోగా సినీ ఇండస్ట్రీ లో రాణించాడు. ఆ తర్వాత సీరియల్ హీరో గా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించాడు. సీరియల్ రంగం లోకి వచ్చిన తర్వాత అచ్యుత్ ఆయనకు పరిచయమయ్యాడు. అచ్యుత్ ఆరోజుల్లో ప్రదీప్ ని హీరో గా పెట్టి పలు సీరియల్స్ ని కూడా నిర్మించాడు. అలా వృత్తిపరంగా స్నేహితులైన వీళ్లిద్దరు, సొంత అన్నదమ్ముల రేంజ్ లో తమ బాండింగ్ ని బలపర్చుకున్నారు. ప్రదీప్ ఇప్పటికీ కూడా సినిమాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ‘F2’ మరియు ‘F3’ చిత్రాల్లో ఆయన పలికిన ‘అంతేగా..అంతేగా’ అనే డైలాగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా ఈ ఏడాది ప్రారంభం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘ఇస్మార్ట్ జోడి సీజన్ 3’ లో తన సతీమణి తో కలిసి ఒక జోడీగా పాల్గొన్నాడు.
