Telugu Stars Education Qualifications: సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం…
నందమూరి తారక రామారావు
నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గుంటూరు ఎసి కాలేజీ (ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ ) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A) పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసిన 1100 మందిలో ఏడుగురు ఎంపికైతే..వారిలో ఒకరిగా నిలిచారు.నటనపై ఆసక్తితో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగాన్ని వదిలి సినిమా బాట పట్టారు.
Also Read: విజయవాడకు వంగవీటి పేరు పెడతారా?
అక్కినేని నాగేశ్వరరావు:
తెలుగు సినిమాకు ఒక కన్ను ఎన్టీఆర్ అయితే మరో కన్ను ఏఎన్నార్. ఆంధ్రుల అభిమాన హీరోగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు పెద్దగా చదువుకోలేదు. కేవలం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, తర్వాత ఇంగ్లీష్ వంటి భాషలు కూడా నేర్చుకున్నారు.
ఘట్టమనేని కృష్ణ
బుర్రెపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ ఏలూరులోని సి ఆర్ రెడ్డి కాలేజ్ నుండి B.Sc డిగ్రీ పూర్తి చేశారు.. ఇంజనీరింగ్ చేద్దామనుకుంటే ప్రవేశం దక్కలేదు. దీంతో సినిమాల్లోకి వచ్చారు.
శోభన్ బాబు
సోగ్గాడు శోభన్ బాబు బిఎ పూర్తి చేశాక లా (LAW) కాలేజీలో చేరి మధ్యలో ఆపేశారు..తర్వాత సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత స్టార్ గా వెలుగొందారు.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు. దీంతో ఆయన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లోని వై ఎన్ కాలేజ్ నుండి B.Com పట్టా అందుకున్నారు.
బాలకృష్ణ
నట సింహం బాలకృష్ణ సైతం డిగ్రీ పూర్తి చేశారు. ఆయన హైదరాబాద్ నిజాం కాలేజీలో B.Com పూర్తి చేశారు.
వెంకటేష్
పెద్ద చదువులు పూర్తి చేరిన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన అమెరికాలో MBA పూర్తి చేశారు..తర్వాత ఇండియా వచ్చి కలియుగ పాండవులు సినిమాతో సిని ప్రయాణం మొదలు పెట్టారు. నిజానికి తండ్రి రామానాయుడు వెంకటేష్ ని బిజినెస్ మెన్ ని చేద్దామనుకున్నారు.
నాగార్జున
ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పెద్ద చదువులు చదివారు. తనకు చదువు లేకపోవడంతో నాగేశ్వరరావు నాగార్జున బాగా చదువుకోవాలని ఆశపడ్డారు. నాగ్ మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో MS చేశారు..
పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కి చదువు పట్ల అంత ఆసక్తి ఉండేది కాదని ఆయనే పలు మార్లు వెల్లడించారు.
మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు మద్రాస్ లోని లయోలా కాలేజ్ లో B.Com పూర్తి చేశారు. మహేష్ ఇంగ్లీష్ లో దిట్ట. ఆయనకు తెలుగు కనీసం చదవడం రాకపోవడం శోచనీయం.
ప్రభాస్
ఇక మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భీమవరంలోని డి ఎన్ ఆర్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అనంతరం ప్రభాస్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు.
రానా
దగ్గుబాటి రానా విద్యాభ్యాసం కూడా చెన్నై లో సాగింది.రానా ఫిలిం స్కూల్ నుండి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. రానా ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడతారు.
జూ.ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. 19 ఏళ్లకే హీరోగా మారిన ఎన్టీఆర్ పెద్దగా చదువుకోలేదు. అయితే ఇంగ్లీష్, కన్నడ, తెలుగు భాషల్లో పట్టుంది.
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఎమ్మెస్సార్ కాలేజ్ నుండి BBA పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి కాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఆయన చిరుత సినిమాతో హీరోగా మారారు.
Also Read: ఊసరవెల్లి రంగులు మార్చడం వెనుక అసలు కారణం ఏంటో తెలిస్తే..!: