Shiva Puja With Datura Flower: సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు.ఆ శివయ్య అనుగ్రహం మనపై ఉండాలంటే శివుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేసి పూజించడంవల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.
అయితే స్వామి వారికి అన్ని రకాల పదార్థాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి స్వామివారికి పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వుతో అభిషేకం నిర్వహించి అభిషేకం అనంతరం పూజించడం వల్ల ఎల్లవేళలా శివయ్య అనుగ్రహం మనపై ఉండి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజించే ముందు తప్పకుండా వినాయకుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేయాలి. ఇలా స్వామివారికి ప్రదోషకాల సమయంలో ఈ పుష్పాలతో అభిషేకం చేసే పూజ చేయటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి.
Also Read: తినడానికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలివే!
ప్రతి నెలలో ఈ ప్రదోషకాలం రెండు సార్లు వస్తుంది ఒకటి అమావాస్యకు ముందు రోజు రెండవది పౌర్ణమికి ముందు రోజు. ఇలా ప్రదోష సమయంలో స్వామివారికి ఉమ్మెత్త పువ్వుతో అభిషేకం నిర్వహించి పూజ చేయడం వల్ల మనకు ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కుజదోష సమస్యతో బాధపడేవారు ఈ దోషం నుంచి విముక్తి కావాలంటే ప్రదోష సమయంలో స్వామివారికి పూజ చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక వివాహం కాని వారు,వివాహమైన వారు ఉమ్మెత్త పువ్వులతో స్వామికి పూజ చేయటం వల్ల వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
Also Read: ఊసరవెల్లి రంగులు మార్చడం వెనుక అసలు కారణం ఏంటో తెలిస్తే..!