Site icon OkTelugu

Dhurandhar 2 Major Iqbal Role Missed Tamil Superstar: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

Dhurandhar Netflix Record

Dhurandhar Netflix Record

Dhurandhar 2 Major Iqbal Role Missed Tamil Superstar: ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలబడడానికి ప్రధాన కారణం ఆ సినిమాలోని కథా బలం తో పాటు, నటీనటుల అద్భుతమైన నటన కూడా. ముఖ్యంగా మొదటి భాగం లో హీరో రణవీర్ సింగ్ తో పాటు, రెహమాన్ క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా , ఎస్పీ అస్లాం క్యారెక్టర్ పోషించిన సంజయ్ దత్ , మేజర్ ఇక్బల్ క్యారెక్టర్ పోషించిన అర్జున్ రాంపాల్ వంటి వారు ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. థియేటర్స్ లో ఆడియన్స్ కి అన్ లిమిటెడ్ గూస్ బంప్స్ ని రప్పించారు. అయితే మొదటి భాగం లో ఉన్నటువంటి రెహమాన్ డెకాయిట్ పాత్ర, రెండవ భాగం లో లేదు. కనీసం ఫ్లాష్ బ్యాక్ లో అయినా కనిపిస్తాడేమో అనుకుంటే, అసలు కనిపించలేదు.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

కానీ రెండవ భాగం లో మేజర్ ఇక్బల్ క్యారెక్టర్ సినిమాకు ప్రధానమైన హైలైట్స్ లో ఒకటిగా నిల్చింది. ISI ఉగ్రవాద సంస్థకు అధినేత గా , ముంబై లోని తాజ్ హోటల్స్ పై అప్పట్లో అటాక్ చేసిన వాడిగా మొదటి భాగం లో చూపించారు మేకర్స్. రెండవ భాగం లో ఆ అటాక్స్ కి కారణమైన ప్రతీ ఒక్కరిని ఏరిపారేసే పాత్రలో హీరో రణవీర్ సింగ్ కనిపించాడు. అయితే ఈ మేజర్ ఇక్బల్ క్యారెక్టర్ కోసం ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య డర్ మన సౌత్ లో ఇద్దరు హీరోలను సంప్రదించాడట. ఒకరు రానా దగ్గుబాటి కాగా, మరొకరు విజయ్ సేతుపతి. రానా దగ్గుబాటి కి ఈ క్యారక్టర్ చేయడం ఇష్టం ఉన్నప్పటికీ, ఆయన విదేశాల్లో కొన్ని వ్యాపార పనుల్లో బిజీ గా ఉండడం వల్ల, డేట్స్ ని కేటాయించలేకపోయాడు. ఇక విజయ్ సేతుపతి ఇలాంటి పాత్రలు దొరికినప్పుడు మిస్ అవ్వడు . కానీ ఆ సమయం లో ఆయన వరుసగా మూడు సినిమాల షూటింగ్స్ లో బిజీ గా ఉన్నాడు.

ఆ కారణం చేత, ఆయన కూడా ఈ సినిమాలో నటించలేకపోయాడు. ఒకవేళ విజయ్ సేతుపతి ఈ చిత్రం లో నటించి ఉండుంటే , ఈ సినిమాకు ఇంకా గొప్ప క్రేజ్ వచ్చి ఉండేదని అంటున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి చాలా పవర్ ఫుల్ గా నటిస్తాడు కాబట్టి, ఆయన ఈ సినిమా లో నటిస్తే ఆయన కోసం క్యారెక్టర్ ని మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేసి ఉండేవాళ్ళని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ క్యారెక్టర్ లో అర్జున్ రాంపాల్ కూడా అద్భుతంగా నటించాడు, ఆయన నటనకు వంక పెట్టలేం కానీ, విజయ్ సేతుపతి చేసుంటే అదిరేది, ఆయన కెరీర్ కి కూడా చాలా ఉపయోగపడేది అని అంటున్నారు విశ్లేషకులు.

Exit mobile version