Site icon OkTelugu

Prabhas Rajinikanth Missed Movie Combo: ప్రభాస్ – రజినీకాంత్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటంటే..?

Prabhas Rajinikanth Missed Movie Combo

Prabhas Rajinikanth Missed Movie Combo

Prabhas Rajinikanth Missed Movie Combo: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన చాలా సినిమాలు భారీ విజయాలను సాధించాయి. తనలాంటి స్టార్ హీరో మరొకరు లేరు అనేంతలా గుర్తింపుని సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకానొక సందర్భంలో రజనీకాంత్ తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఆ అవకాశం చేజారిపోయిందనే చెప్పాలి.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ – రజనీకాంత్ అభిమానిగా కనిపిస్తాడు. ఈ సినిమాలోనే రజనీకాంత్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ ను కూడా డిజైన్ చేశారట. కానీ రజనీకాంత్ అప్పుడు చాలా సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ చేయలేకపోయాడు.

మొత్తానికైతే పూరి జగన్నాథ్ రజనీకాంత్ చేత ఒక క్యారెక్టర్ ని చేయించి సినిమా మీద భారీ ఎలివేషన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో ప్రభాస్ సైతం తీవ్రమని నిరాశను వ్యక్తం చేశాడు. తనకు రజనీకాంత్ సినిమాలో చిన్న రోల్ ఇచ్చిన సరే నటిస్తానని ప్రభాస్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే తనకు ఇష్టమైన హీరోల్లో రజనీకాంత్ కూడా ఒకరు కావడం విశేషం…

ఇక బుజ్జిగాడు సినిమాలో తన రజనీకాంత్ అభిమానిగా కనిపించాడు. కాబట్టి ఆ సినిమాలోని రజనీకాంత్ చేసి ఉంటే ఆ సినిమా సైతం భారీ విజయాన్ని సాధించేదని అతను ఎప్పుడు అభిప్రాయపడుతూ ఉంటాడు… మరి ఫ్యూచర్లో వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూడాలి…

Exit mobile version