Site icon OkTelugu

Andhra Pradesh IAS Transfers 2026: ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు.. సీఆర్డీఏ కమిషనర్ మార్పు!

Andhra Pradesh IAS Transfers 2026

Andhra Pradesh IAS Transfers 2026

Andhra Pradesh IAS Transfers 2026: ఏపీలో( Andhra Pradesh) పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. మరోవైపు సిఆర్డిఏ కమిషనర్ గా విజయరామరాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు సిఆర్డిఏ కమిషనర్ గా కన్నబాబు ఉండేవారు. ఆయన పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. మార్కాపురం కొత్త కలెక్టర్ గా విజయ సునీత, పోలవరం జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్ నియమితులయ్యారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా ఉన్న సౌరబ్ గౌర్ ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ ప్రక్రియ పూర్తి చేసింది ప్రభుత్వం.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

* మార్పులు ఇవే..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులను మార్చింది ప్రభుత్వం. ప్రధానంగా సి ఆర్ డి ఏ కమిషనర్ కన్నబాబు కు స్థానచలనం కలిగింది. ఆయన 2025 జనవరిలో కమిషనర్ గా నియమితులయ్యారు. సరిగ్గా 14 నెలల్లోనే ఆయన బదిలీ కావడం విశేషం. ప్రస్తుతం సౌరబ్ గౌర్ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కన్నబాబును ఆ పోస్టుకు బదిలీ చేయడంతో సౌరబ్ గౌర్ రిలీవ్ కావాల్సి వచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం సిఆర్డిఏ కమిషనర్ గా విజయరామరాజును నియమించింది. ఇప్పటివరకు ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా ఉండేవారు.

ఇటీవల కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. మార్కాపురం తో పాటు పోలవరం జిల్లాలు ఏర్పాటు కావడంతో నూతన కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. మార్కాపురం జిల్లా కలెక్టర్గా మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ ఎం విజయ సునీత, పోలవరం జిల్లా కలెక్టర్ గా ఆయుష్ విభాగం డైరెక్టర్ కొత్తమాను దినేష్ కుమార్ నియమితులయ్యారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి పట్టన్ శెట్టి రవి సుభాష్ కు మార్కెటింగ్ విభాగం డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
* ఏపీ ప్రభుత్వ దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ గా రిటైర్డ్ జిల్లా జడ్జ్ నాగరాజు నియమితులయ్యారు.
* ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గా బిగినేపల్లి సందీప్ నియమితులయ్యారు.

Exit mobile version