Site icon OkTelugu

Devansh Birthday: దేవాన్ష్ బర్త్ డే: టీటీడీకి చంద్రబాబు కుటుంబం భారీ విరాళం!

Devansh Birthday

Devansh Birthday

Devansh Birthday: ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu) మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్సు పుట్టినరోజు ఈరోజు. అయితే దేవాన్ష్ ప్రతి పుట్టినరోజు ఒక ఆనవాయితీని కొనసాగిస్తోంది ఆ కుటుంబం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే కాదు. అన్నప్రసాదాలకు భారీ విరాళం ప్రకటిస్తూ వచ్చింది ఆ కుటుంబం. ఈ ఏడాది కూడా పుట్టినరోజు వేడుకలు తిరుమలలోనే నిర్వహించుకోవాలని భావించిన చంద్రబాబు కుటుంబంతో సహా తిరుమల వెళ్లారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీ వేంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్నప్రసాదాలను స్వీకరించారు. దేవాన్సు పుట్టినరోజు సందర్భంగా ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్ కు చంద్రబాబు రూ.44 లక్షలు విరాళంగా ఇవ్వడం ఆనవాయితీ. అన్నప్రసాద వితరణకు సంబంధించి ఒక రోజు ఖర్చు. చంద్రబాబు కుటుంబ సభ్యుల స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

* ఏటా ఇదే ఆనవాయితీ..
ఏటా దేవాన్స్( Devansh) పుట్టినరోజు తిరుమలలో ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది చంద్రబాబు కుటుంబం. అయితే ముందుగానే అన్నప్రసాద్ వితరణకు గాను 44 లక్షల రూపాయలు అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ముందుగానే అందించారు. ఈరోజు స్వామివారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టునున్నారు. తిరుమల అభివృద్ధిపై కూడా అధికారులతో సమీక్షిస్తారు సీఎం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

* లోకేష్ పుట్టినరోజు నాడు..
మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) పుట్టినరోజు సందర్భంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. జనవరి 23న మంత్రి లోకేష్ పుట్టినరోజు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఒక్కరోజు భక్తుల అన్న ప్రసాద వితరణకు గాను టీటీడీకి 44 లక్షల రూపాయలు అందజేశారు. ఏదైనా పర్వదినాలతో పాటు పుట్టినరోజుల సమయంలో భక్తులకు అన్నప్రసాద వితరణకు ఎస్.వి అన్నదాన ట్రస్ట్ కు విరాళం అందించవచ్చు. ఒకరోజు టీటీడీకి వచ్చే భక్తుల అన్నప్రసాద వితరణకు 44 లక్షలు ఖర్చు అవుతాయి. చాలామంది ఇలానే విరాళాలు ఇస్తుంటారు. సాధారణ భక్తులు సైతం తమకు తోచిన విధంగా సహాయం అందించవచ్చు. మరోవైపు చంద్రబాబు కుటుంబం తిరుమల దర్శనం నేపథ్యంలో అధికార కూటమి నేతలతో పాటు అధికారుల హడావిడి కనిపించింది.

Exit mobile version