Post Office Account Opening: ప్రస్తుత కాలంలో ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదిరిపోయే లాభాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అయితే పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వాళ్లు గతంతో పోలిస్తే నిబంధనలు మారాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పాన్ కార్డ్ లేనివాళ్లు ఫామ్ 60తో ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు ఇచ్చిన పాన్ కార్డ్ నంబర్ కరెక్ట్ గా నమోదై ఉందో తప్పుగా నమోదై ఉందో ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా తనిఖీ చేయడం జరుగుతుంది. ఎవరైనా పొరపాటున పాన్ కార్డ్ నంబర్ ను తప్పుగా ఇచ్చి ఉంటే మాత్రం టీడీఎస్ రిటర్న్ లను పొందే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాన్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు పాన్ కార్డును ఆధార్ నంబర్ తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: మనుషులను నాశనం చేసే ఐదు ప్రమాదకరమైన అలవాట్ల గురించి మీకు తెలుసా?
టీడీఎస్ రిటర్న్‌లను దాఖలు చేసే సమయంలో చాలా పాన్ నంబర్లను అంగీకరించడం లేదని వెల్లడవుతోంది. పాన్ కార్డ్ నంబర్లను అంగీకరించకపోతే పోస్టాఫీస్ లో అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. పాన్ నంబర్లను నమోదు చేసే సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అందుకు సంబంధించిన కారణాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే పోస్టాఫీస్ లో అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లు సైతం పాన్ కార్డ్ నంబర్ ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఫామ్ 60ను సబ్మిట్ చేస్తారో వాళ్లు కూడా తప్పనిసరిగా పాన్ కార్డ్ ను ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ లో అకౌంట్ ను ఓపెన్ చేసేవాళ్లు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
Also Read: కరెంటు తీగల పై కూర్చున్నా పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు ?