Deepika Rangaraju
Deepika Rangaraju: తన తొలి తెలుగు సీరియల్ తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ‘ బ్రహ్మముడి ‘ ఫేమ్ కావ్య . ఈమె అసలు పేరు దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. స్టార్ మా లో నంబర్ వన్ సీరియల్ గా హైయెస్ట్ టీఆర్పీ రాబడుతుంది. ఈ క్రమంలో దీపిక రంగరాజు బాగానే వసూలు చేస్తుందట. దీపిక రంగరాజు రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. దీపిక రంగరాజు సంపాదన నెలకు రూ. 7 నుంచి రూ.. 10 లక్షల వరకు ఉందని సమాచారం.
న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించింది దీపిక రంగరాజు. ఆ తర్వాత తమిళ సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ కి విశేష స్పందన లభించడంతో ఆమెకు నటిగా గుర్తింపు వచ్చింది. ఇక తెలుగులో ‘ బ్రహ్మముడి ‘ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. బ్రహ్మముడి ధారావాహిక తక్కువ సమయంలో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా ‘ బ్రహ్మముడి ‘లో కావ్య పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
బాధ్యత గల భార్యగా… పుట్టింటి, అత్తింటి గౌరవాన్ని నిలబెట్టే పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ సీరియల్ లో హీరో రాజ్ పాత్ర కంటే కావ్య క్యారెక్టర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల స్టార్ మా అవార్డ్స్ లో దీపిక కి బెస్ట్ డాటర్ పురస్కారం దక్కడం విశేషం. బ్రహ్మముడి సీరియల్ కి గాను దీపిక రంగరాజు గట్టిగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట.
బ్రహ్మముడి సీరియల్ నిర్మాతలు ఆమెకు రోజుకు సుమారు రూ. 25 వేల రూపాయల రెమ్మ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. నెలకు కనీసం 25 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. కాబట్టి బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపిక రంగరాజు నెలకు రూ. 6.25 లక్షల రెమ్యూనరేషన్ రాబడుతుందట . అంతేకాదు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తుంది. పలు స్పెషల్ ఈవెంట్స్, షోలలో సందడి చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
Web Title: Do you know the remuneration of deepika rangaraju
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com