https://oktelugu.com/

IT Returns: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారి బ్యాంకు అకౌంట్ లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?

IT Returns: ఆర్థిక వ్యవహారాలు నడిపే వారికి బ్యాంకు అకౌంట్ తప్పననిసరి. చిన్న రైతు నుంచి బడా వ్యాపార వేత్త వరకు ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ను కలిగి ఉంటున్నారు. దీంతో ఎవరు ఎలాంటి ట్రాన్జాక్షన్ చేస్తున్నారో ప్రభుత్వానికి తెలిసిపోతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 3, 2024 3:53 pm
    Income Tax Returns

    Income Tax Returns

    Follow us on

    IT Returns: ఆర్థిక వ్యవహారాలు నడిపే వారికి బ్యాంకు అకౌంట్ తప్పననిసరి. చిన్న రైతు నుంచి బడా వ్యాపార వేత్త వరకు ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ను కలిగి ఉంటున్నారు. దీంతో ఎవరు ఎలాంటి ట్రాన్జాక్షన్ చేస్తున్నారో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో లిమిట్ క్రాస్ చేసి డబ్బు డిపాజిట్ చేసినా.. విత్ డ్రా చేసినా.. దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు ఆదాయపు పన్ను చెల్లించాలనుకునేవారికి బ్యాంకుల్లో జరిపే వ్యవహారాలు ఆధారంగా ఉంటాయి. దీనిని బట్టే ఆదాయపు పన్ను ఎంత చెల్లించాలో నిర్ణయించబడుతుంది. ఈ వివరాల్లోకి వెళితే..

    వ్యాపారవేత్తలు, ప్రతి రోజూ నగదు వ్యవహారాలు తప్పకుండా జరిపేవాళ్లు కరెంట్ అకౌంట్ ను కలిగి ఉంటారు. వీరు నగదు వ్యవహారాలను ఎక్కువగా జరుపుతూ ఉంటారు. అందువల్ల వీరు బ్యాంకుల్లో ఉంచిన డబ్బుకు ఎలాంటి వడ్డీ రాదు. ఈ సమయంలోనే నగదు ట్రాన్జాక్షన్ ఎక్కువగా చేసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ ఉన్నవారు గరిష్టంగా రూ.50 లక్షల వరకు నగదు ట్రాన్జాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ నగదు వ్యవహారాలు జరిపితే మాత్రం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

    మిగతా వారికి ఉండే ది సేవింగ్స్ అకౌంట్. ఈ రకపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అంతేకాకుండా పరిమితంగా నగదు వ్యవహారం జరపాలి. సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారు రూ. 10 లక్షలకు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే దానిని ఐటీ రిటర్న్స్ కు తెలియజేయాలి. అంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాల్సి వస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

    ఆదాయంపు పన్ను చట్టం సెక్షన్ 269ST ప్రకరాం తన అకౌంట్ కు ఉన్న పరిమితికంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే అదాయపు పన్నును చెల్లంచాలి. అంటే ఆదాయపు పన్ను ను మూడేళ్లుగా చెల్లంచని వారు రూ.20 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే TDS 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కోటి రూపాయల వరకు విత్ డ్రా చేస్తే 5 శాతం చెల్లించాలి. ఇక సేవింగ్స్ అకౌంట్ లో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే పెనాల్టీ విధిస్తారు. అయితే ఈ మొత్తం డిపాజిట్ చేస్తే మాత్రం వర్తించదు.