https://oktelugu.com/

టీజర్ టాక్.. అంధురాలిగా నయన్.. సస్సెన్స్ థిల్లర్ గా ‘నెట్రికాన్’..!

లేడి సూపర్ స్టార్ నయనతార కొద్దిరోజులుగా లేడి ఓరియెంటేడ్ మూవీలకే ప్రాధాన్యం ఇస్తుంది. నయనతార గ్లామర్ కంటే ఫార్మమెన్స్ సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. నయనతార నటించిన ‘అమ్మోరు తల్లి’ మూవీ కూడా ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా రిలీజుకు  ముందు నయన్ అమ్మోరుగా నటించడంపై పలువురు విమర్శలు చేయగా వాటన్నింటిని తన నటనతోనే చెక్ పెట్టింది. Also Read: టీజర్ టాక్.. బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకున్న ‘కమిట్ మెంట్’ ‘అమ్మోరు తల్లి’ తర్వాత […]

Written By: , Updated On : November 18, 2020 / 03:03 PM IST
Follow us on

Netrikann

లేడి సూపర్ స్టార్ నయనతార కొద్దిరోజులుగా లేడి ఓరియెంటేడ్ మూవీలకే ప్రాధాన్యం ఇస్తుంది. నయనతార గ్లామర్ కంటే ఫార్మమెన్స్ సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. నయనతార నటించిన ‘అమ్మోరు తల్లి’ మూవీ కూడా ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా రిలీజుకు  ముందు నయన్ అమ్మోరుగా నటించడంపై పలువురు విమర్శలు చేయగా వాటన్నింటిని తన నటనతోనే చెక్ పెట్టింది.

Also Read: టీజర్ టాక్.. బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకున్న ‘కమిట్ మెంట్’

‘అమ్మోరు తల్లి’ తర్వాత నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నెట్రికాన్’. ‘గృహం’ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన మిలింద్ రౌ ‘నెట్రికాన్’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ క్రాస్ పిక్చర్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. నేడు నయనతార బర్త్ డే సందర్భంగా ‘నెట్రికాన్’ చిత్రయూనిట్ టీజర్ విడుదల చేసి విషెస్ చెప్పింది.

నయనతార ‘నెట్రికాన్’ మూవీలో అంధురాలిగా నటిస్తుండటం విశేషం. ఎలాంటి క్యారెక్టర్ అయిన అవలీలగా పోషించే నయనతార ప్రత్యేకత. తాజాగా మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది. టీజర్లో నయనతార స్రీన్ ఆప్పీయరెన్స్ అభిమానులను ఆకట్టుకుంది.

Also Read: నయన్ బర్త్ డే.. లేడి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగిందంటే?

అంధురాలిగా మారిన ఓ పోలీస్ అధికారిణి తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరిస్తుందనేది టీజర్లో చూపించారు. టీజర్ ఆద్యంతం సస్సెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. గిరీష్ గోపాలకృష్ణన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ‘నెట్రికాన్‘లో అజ్మల్.. మణికందన్.. శరణ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నెట్రికాన్ తో నయనతార మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించడం ఖాయంగా కన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Netrikann - Official Teaser | Nayanthara | Vignesh Shivan | Milind Rau |  Girishh Gopalakrishnan