https://oktelugu.com/

దేశంలో మరో బ్యాంకు దివాలా..? మనీ విత్ డ్రాపై ఆంక్షలు

భారత్ లో బ్యాంకులు తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. కొంత మంది ప్రైవేట్ వ్యక్తుల నిర్వాకంతో బ్యాంకుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారగా.. మరికొన్ని కరోనా కారణంగా దివాలా తీస్తున్నాయి. గతంలో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎగనామం పెట్టిన తరువాత నుంచి ఒక్కో బ్యాంకు పరిస్థతి అధ్వానంగా మారింది. మరోవైపు చిన్నా చితక బ్యాంకులను జాతీయ బ్యాంకుల్లో విలీనం చేయడంతో ఉన్న బ్యాంకులు కరోనా ఊబిలో చిక్కుకుని తమ మనుగడ సాధించలేకపోతున్నాయి. Also Read: కేసీఆర్ 10వేల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 02:55 PM IST
    Follow us on

    భారత్ లో బ్యాంకులు తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. కొంత మంది ప్రైవేట్ వ్యక్తుల నిర్వాకంతో బ్యాంకుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారగా.. మరికొన్ని కరోనా కారణంగా దివాలా తీస్తున్నాయి. గతంలో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎగనామం పెట్టిన తరువాత నుంచి ఒక్కో బ్యాంకు పరిస్థతి అధ్వానంగా మారింది. మరోవైపు చిన్నా చితక బ్యాంకులను జాతీయ బ్యాంకుల్లో విలీనం చేయడంతో ఉన్న బ్యాంకులు కరోనా ఊబిలో చిక్కుకుని తమ మనుగడ సాధించలేకపోతున్నాయి.

    Also Read: కేసీఆర్ 10వేల సాయం.. పోటెత్తిన జనం

    గతంలో ఎస్ బ్యాంకు దివాలా తీసి ఖాతాదారులకు నష్టాలను తెచ్చిపెట్టింది. తాజాగా మరో బ్యాంకు కూడా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు లాభాలతోనే నడిచిన లక్ష్మి విలాస్ బ్యాంకు ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తమ ఖాతాదారులకు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు డ్రా చేసుకోవడంపై ఆంక్షలు విధించింది. దీంతో తమ నిల్వలను దాచుకున్న ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

    కరోనా కాలంలో ఈఎంఐ చెల్లించే వారికి ఆరు నెలల మారిటోరియంలపై కేంద్ర ప్రభుత్వం వెలుసుబాటు కలిపించింది. అయితే ఈ మొత్తాన్ని తరువాత కాలంలో వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చని తెలిపింది. కానీ వీటిపై వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే కొన్ని బ్యాంకుల్లో చాలా మంది ఖాతాదారులు మారిటోరియంను వినియోగించుకున్నారు. దీంతో బ్యాంకులకు ఆదాయం రాక దివాలా తీసింది.

    Also Read: భక్తులకు అలర్ట్.. కరోనా నెగటివ్ వస్తేనే పుష్కరాలకు అనుమతి..?

    తాజాగా లక్ష్మీ విలాస్ బ్యాంకు పరిస్థితి కూడా ఆ విధంగానే నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో బ్యాంకులకు ఆదాయం రాకపోవడంతోనే విత్ డ్రా చేసుకునే ఖాతాదారులకు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో కొత్త ఖాతాదారులు రావడం మానేశారు. తద్వారా బ్యాంకుల నిర్వహణ కష్టసాధ్యమవుతోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్