Akahanda: అఖండ సినిమా చూసిన చంద్రబాబు.. ఏపీతో ముడిపెడుతూ ఏమన్నారంటే?

Akahanda: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది. ఈ సినిమా […]

Written By: Raghava Rao Gara, Updated On : December 12, 2021 11:33 am
Follow us on

Akahanda: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది.

ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సూపర్ అంటూ కామెంట్​ చేస్తున్నారు. తాజాగా, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అఖండ వీక్షించారు. అనంతరం మంగళగిరి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అఖండ సినిమాలో చూపించారని ఆయన అన్నారు.. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు.

సినిమా విడుదలైన మొదటి వారంలోనే భారీ కలెక్షన్లలతో ముందుకు దూసుకెళ్లింది. అతి త్వరలోనే వందకోట్ల సినిమా క్లబ్​లో చేరనుంది. థమన్​ అందించిన మ్యూజిక్​ సినిమాను మరో లెవెల్​లో కూర్చోబెట్టింది. సినిమాలో బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ను థమన్​ దుమ్ములేపాడు. బోయపాటి- బాలయ్య కాంబినేషన్​లో ఇది మూడో హ్యాట్రిక్​ సినిమా కావడం విశేషం. సింహా లెజెండ్​ తర్వాత అఖండతో వరుసగా మూడు చిత్రాలను హిట్ కొట్టారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్​ విలన్​గా, ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా కనిపించారు. జగపతి బాబు కీలక పాత్రలో దర్శనమిచ్చారు.