Balayya , Sukumar
Balayya and Sukumar : ‘అఖండ'(Akhanda Movie) కి ముందు బాలయ్య(Nandamuri Balakrishna) వేరు, ‘అఖండ’ తర్వాత బాలయ్య వేరు. ఆయన లేటెస్ట్ వెర్షన్ లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు ఆయన. అంతే కాకుండా ‘అన్ స్టాపబుల్'(Unstoppable Show) షో ఆయన ఇమేజ్ ని ఎంతలా పెంచిందో మనమంతా కళ్లారా చూసాము. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి ఈ టాక్ షో బాలయ్య ని బాగా దగ్గర చేసింది. ఈ షో ద్వారా అల్లు అరవింద్ కుటుంబంతో బాలయ్య కి ఉన్న సాన్నిహిత్యం ఇంకా బలపడింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో బాలయ్య బాబు ని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘నందమూరి ఫ్యామిలీ కి, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు ఏర్పడ్డాయని అప్పట్లో ఒక రూమర్ వచ్చింది..ఇది ఎంత వరకు నిజం’ అని అడుగుతాడు.
దానికి బాలయ్య బాబు సమాధానం చెప్తూ ‘అలాంటిదేమి లేదు..మేమంతా బిజీ గా ఉండడం వల్ల రెగ్యులర్ గా కలుసుకోలేకపొయ్యేవాళ్ళం అంతే..అల్లు అర్జున్ నాకు ఎంతో క్లోజ్. అన్నపూర్ణ స్టూడియోస్ లో మా ఇద్దరి షూటింగ్స్ పక్క పక్కనే జరిగేవి. పుష్ప 2 సెట్స్ లోకి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. అప్పుడే క్లైమాక్స్ సన్నివేశం తీస్తున్నారు అనుకుంట. సుకుమార్ కి కరచాలం కి బదులుగా, కత్తి చూపించాను. వామ్మో, ఏంటి సార్ కత్తి చూపిస్తున్నారు అని సుకుమార్ భయపడి అడిగాడు. అన్ స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు మూడు నెలల్లో సినిమా తీస్తానని మాట ఇచ్చావు కదా, ఇప్పుడు ఎన్ని నెలల్లో సినిమా తీస్తున్నవి అంటూ సరదాగా బెదిరిస్తూ మాట్లాడాను’ అంటూ బాలయ్య అప్పుడు జరిగిన ఫన్నీ మూమెంట్స్ ని ఈ ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
సుకుమార్ తన ప్రతీ సినిమాని రాజమౌళి లాగా ఏళ్ళ తరబడి షూటింగ్స్ చేస్తూ వచ్చే అలవాటు ఉందనే విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప 2 చేయడానికి కూడా ఆయన మూడేళ్ళ సమయం తీసుకున్నాడు. పుష్ప మొదటి భాగం విడుదలైన కొత్తల్లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun), సుకుమార్(Director Sukumar), రష్మిక(Rashmika Mandana) కలిసి ‘అన్ స్టాపబుల్’ షోకి వస్తారు. అప్పుడు బాలయ్య సుకుమార్ తో చేయించుకున్న ప్రామిస్ అది. ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీను తో కలిసి ‘అఖండ 2 ‘ చేస్తున్నాడు. గత కొంతకాలం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, ఎట్టి పరిస్థితిలోను సెప్టెంబర్ 25 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో విలన్ గా ఆది పిన్నిశెట్టి నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టాడు.