spot_img
Homeఎంటర్టైన్మెంట్Senior NTR: ఎన్టీఆర్ సక్సెస్ కి అదే ప్రధాన కారణం !

Senior NTR: ఎన్టీఆర్ సక్సెస్ కి అదే ప్రధాన కారణం !

Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ పద్దతి వేరు. ఆయన ఏ పాత్ర అయితే, నటించాల్సి వస్తోందో.. ఆ పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేయడం సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న అలవాటు. బిచ్చగాడిలా నటించాల్సి వస్తే.. ఎన్టీఆర్ బిచ్చగాళ్ళతో కొన్నాళ్ళు స్నేహం చేసేవారు, ఒకవేళ మానసిక రోగిగా నటించాల్సి వస్తే కొన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో ఉండి వస్తారు. అడవి మనిషి వేషం వేయాలంటే పచ్చి మాంసాన్ని తినడం.. ఇలాంటి పద్ధతులలో ఎన్టీఆర్ దిట్ట.

Senior NTR
Senior NTR

ఇది మెథడ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ దేవతల పాత్రలు, అవతార పురుషుల పాత్రలు వేయాల్సి వస్తే.. మాంసాహారం ముట్టకుండా కేవలం శాకాహారమే తినేవారు. అలాగే మంచాల పై కాకుండా నేలపైనే పడుకునేవార. ఇలా చేయడం వల్ల సాత్వికత అభివృద్ధి చెందుతుందనీ, రాక్షస లక్షణాలైన తామస గుణాల నుంచి మనసు దూరమై పరిశుద్ధంగా ఉంటుందని ఎన్టీఆర్ భావించేవారు.

అంత గొప్పగా నిష్ఠగా ఉంటే.. ఆ తేజస్సు తన ముఖంలో ప్రతిఫలిస్తుందనీ ఎన్టీఆర్ గారు బాగా నమ్మేవారు. దానికి తగ్గట్టుగానే ఆయన విశ్వాసం ఎన్నడూ ఒమ్ము కాలేదు. ఇక రాక్షస / ప్రతినాయక పాత్రలు పోషించేప్పుడు తనలో తామస, రాజస లక్షణాలు పొంగిపొర్లాలని ఎన్టీఆర్ కోరుకునే వారు. అందుకే, ఆ సమయంలో ఆయన విపరీతంగా మాంసాహారం తినేవారు.

Also Read: అక్కడ హిట్ ఇక్కడ ప్లాప్… రజిని-చిరుకి ఉన్న అరుదైన పోలికలు ఇవే !

ఆయన మాంసం వండించుకుని తినే సమయంలో అక్కడ ఉన్నవారు ఎన్టీఆర్ గారిని చూసి ఆశ్చర్యపోఎయేవారట. ఎన్టీఆర్ ఆ స్థాయిలో మాంసాన్ని తీసుకునే వారు. ఏది ఏమైనా ఒక పాత్ర పోషణలో భాగంగా విపరీతమైన శారీరక కష్టాలను ఆహ్వానించి వాటికి ఓర్చడం మెథడ్ యాక్టింగ్‌ లో గొప్ప నియమం. సీనియర్ ఎన్టీఆర్ సక్సెస్ కి ఈ మెథడ్ యాక్టింగ్‌ ప్రధాన కారణం.

ఎన్టీఆర్ ఇలాంటివి అనేకం చేశారు. ఉదాహరణకు తన కెరీర్ మొదట్లోనే ఎద్దు మీద పడే సన్నివేశం ఉంటే డూప్ అక్కరలేదని స్వయంగా చేసి కుడి చేయి విరగ్గొట్టుకుని, పుత్తూరు కట్టు కట్టించుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ఏమిటంటే పాత్ర యొక్క మానసిక స్థితిలోకి, భావోద్వేగంలోకి ప్రవేశించాకా, షాట్ గ్యాప్‌లో రామారావు ఇతరుల్లాగా వేరే పనుల్లోకి, సరదా కబుర్లలోకి దిగేవాడు కాదు. ఆ భావోద్వేగమే అనుభవిస్తూ ఉండేవారు.

Also Read: అందుకే తెలుగు తెర పై హీరోయిన్ స్థాయి పడిపోయింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version