Tandel
Tandel : అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaitanya) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్'(Thandel Movie) బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. విడుదలకు ముందు బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ తో అభిమానుల్లో ఒక రేంజ్ అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం, విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో మొదటి ఆట నుండే సక్సెస్ అయ్యింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏమిటంటే, ఈ చిత్రంలో నాగ చైతన్య అద్భుతంగా నటించడం. అంటే అంతకు ముందు ఆయన నటించలేదని కాదు. ఇలాంటి కఠినమైన రోల్స్ లో మెప్పిస్తాడా లేదా అనే అనుమానం ఆయన అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లో కూడా ఉండేది. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆయన అద్భుతంగా ఈ చిత్రంలో నటించి శబాష్ అనిపించుకున్నాడు. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ముమ్మాటికీ నాగ చైతన్య నటన వల్లే అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే పది రోజులు పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము. పదవ రోజు ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా బుక్ మై షో(Bookmyshow) యాప్ లో ఆదివారం రోజున 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇక 10 రోజులకు కలిపి చూస్తే నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి ఏకంగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదట. నాగ చైతన్య సినిమాకి నైజాం ప్రాంతంలో అంతటి భారీ క్లోజింగ్ రావడమంటే చిన్న విషయం కాదు.
అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో 5 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 5 కోట్ల 70 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 75 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్ల రూపాయిలు, గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 25 లక్షలు, కృష్ణ జిల్లాలో రెండు కోట్ల 12 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 30 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా 10 రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 48 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి భారీ నష్టాలు తప్పేలా లేవు. 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే,ఇప్పటి వరకు 4 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.