Laila and Orange : మన చిన్నతనంలో, లేదా టీనేజ్ వయస్సులో ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు, పెద్దయ్యాక కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని దక్కించుకోవడం వంటివి మనం చాలానే చూసాము. అలా అప్పట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటించిన ‘ఆరెంజ్'(Orange Movie ReRelease) చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో మనమంతా చూసాము. ‘మగధీర’ చిత్రంతో టాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి , ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అప్పట్లో అంచనాలు భారీగా ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సాంగ్స్ విడుదలకు ముందే సెన్సేషన్ అవ్వడంతో రామ్ చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ విడుదల తర్వాత సీన్ మొత్తం రివర్స్. అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా కథ చాలా కొత్తది కాబట్టి తీసుకోలేకపోయారు.
సినిమా అర్థం కాక జుట్టు పీక్కున్నారు. ఫలితంగా మంచి క్రేజ్ తో విడుదల అవ్వడం వల్ల భారీ ఓపెనింగ్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ, క్లోజింగ్ లో డిజాస్టర్ అయ్యింది. ఇక నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు(Nagababu) పరిస్థితి వర్ణనాతీతం. అప్పులపాలయ్యారు, దాదాపుగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సినిమాని గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తే సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ జెనెరేషన్ యూత్ అయితే థియేటర్స్ లో మెంటలెక్కిపోయారు. పాటలు వచ్చినప్పుడు అయితే థియేటర్స్ ని మ్యూజిక్ కన్సర్ట్స్ గా మార్చేశారు ఫ్యాన్స్. మొదటి రీ రిలీజ్ లో నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా, రెండవసారి కూడా అదే స్థాయి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా 14 వ తేదీన ఈ చిత్రాన్ని రెండవసారి రీ రిలీజ్ చేసారు.
మొదటి రోజు ఏకంగా 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 50 లక్షలు, మూడవ రోజు 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి కోటి 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బుక్ మై షో యాప్ లో దాదాపుగా లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమాతో పాటు విడుదలైన కొత్త చిత్రం ‘లైలా'(Laila Movie) కి ఇందులో పావు శాతం ఓపెనింగ్ కూడా రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఆరెంజ్ చిత్రాన్ని హైదరాబాద్ ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు. మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో ఎన్ని షోస్ వేస్తే అన్ని షోస్ హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. అందుకే ఈ వారం మొత్తం షోస్ ని షెడ్యూల్ చేసారు. ఫస్ట్ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ఫుల్ రన్ లో మరో 50 లక్షల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.