https://oktelugu.com/

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలవనున్న తమిళనాడు సీఎం స్టాలిన్…

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్… దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి… విదేశాల్లో కూడా మంచి మార్కెట్‌ ఉన్న స్టార్‌ అంటే రజినీకాంత్ అని సగ్ర్వంగా చెప్పొచ్చు. సూపర్​స్టార్ రజనీకాంత్​కు తమిళంతో పాటు, తెలుగు లో కూడా ఉన్నఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రసీమకు ఆయన చేసిన సేవకుగానూ… దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డుతో […]

Written By: , Updated On : October 31, 2021 / 05:33 PM IST
Follow us on

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్… దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి… విదేశాల్లో కూడా మంచి మార్కెట్‌ ఉన్న స్టార్‌ అంటే రజినీకాంత్ అని సగ్ర్వంగా చెప్పొచ్చు. సూపర్​స్టార్ రజనీకాంత్​కు తమిళంతో పాటు, తెలుగు లో కూడా ఉన్నఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రసీమకు ఆయన చేసిన సేవకుగానూ… దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డుతో కేంద్రం ఇటీవలే ఆయన్ను సత్కరించింది.

tamilnadu cm stalin going to meet super star rajini kanth

అయితే ఇటీవల రజనీకాంత్  అస్వస్థతకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి కావేరి హాస్పిటల్ యజమాన్యం  తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజినీకాంత్ త్వరగా కోలు కుంటున్నారని మరో మూడు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారట.

కాగా రజినీ ఐదు రోజులు క్రితం తల నొప్పి, జ్వరం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై లోని కావేరి ఆస్పత్రి లో చేర్పించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ మెదడు లోని రక్త నాళాల్లో ఉన్న బ్లాక్స్ ను వైద్యులు తొలగించారాణి సమాచారం. అయితే ఈ మేరకు  సూపర్ స్టార్ ఆరోగ్యంపై గురించి తెలుసుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  ఈ రోజు సాయంత్రం తలైవా ను సందర్శించడానికి హాస్పిటల్ కి వెళుతున్నారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులంతా ప్రార్ధనలు, పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన అన్నాత్తే సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.