
Afghanistan Crisis: అఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైనా ప్రపంచం మాత్రం గుర్తించడం లేదు. అఫ్గాన్ ప్రభుత్వంపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతోంది. దీనికి అందరు సహకరించాలని ఆశిస్తోంది. కానీ మునుముందు ఏర్పడే సమస్యలపై కొన్ని దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద ప్రపంచ దేశాలను తమను గుర్తించాలని కోరుతున్నారు.
అఫ్గాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసినా తమను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాలిబన్ల హక్కులు గుర్తించి పాలించడంతో తమను తాము నిరూపించుకుంటున్నామని చెబుతున్నారు. ఏ దేశం కూడా తమను గుర్తించేందుకు ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందే అని పేర్కొన్నారు.
అఫ్గానిస్తాన్ కు ఇప్పటివరకు పాకిస్తాన్, చైనా దేశాలు మాత్రమే సహకారం అందజేస్తున్నాయి. ఇప్పటివరకు ఏ దేశం కూడా తమను అధికారికంగా గుర్తించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నెలకొన్న సంక్షోభాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా సహా ప్రపంచంలోని అన్ని దేశాలు తమ సార్వభౌమత్వాన్ని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.
పాకిస్తాన్ మీదుగా చైనాకు ఎగుమతులు చేస్తున్నారు. దీంతో రవాణా సదుపాయాలు మెరుగైనట్లు తెలుస్తోంది. కానీ ఇతర దేశాలు మాత్రం వారిని గుర్తించడం లేదు. దీంతో వారి పనులు ముందుకు సాగడం లేదు. దీంతో వారిలో ఆందోళన పెరుగుతోంది. తమను కూడా గుర్తించి తమకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా సహకరించాల్సిందిగా కోరుతోంది.
Also Read: భారత్ ను వింత కోరిక కోరిన తాలిబన్లు