Mahesh Babu and Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళ సత్తా చూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ళతో పాటు దర్శకులు సైతం పాన్ ఇండియాలో మంచి రికార్డులను క్రియేట్ చేస్తూ హీరోల కంటే గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. హీరోలతో పాటు సమానమైన క్రేజ్ సంపాదించుకోవడంలో రాజమౌళి ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు…
దర్శక ధీరుడు అయిన రాజమౌళి(Rajamouli),సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీద రోజుకొక వార్త వస్తుండటమే కాకుండా ఆ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుంచి మహేష్ బాబు అభిమానులు, రాజమౌళి ఫ్యాన్స్ సైతం పాజిటివ్ వైబ్ తో ఉన్నారు. ఎలాగైనా సరే ఈ సినిమాతో పాన్ వరల్డ్ రికార్డులను తిరగరాయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ తెరకెక్కించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నారట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా అడ్వెంచర్ జానర్లో తెరకెక్కబోతుంది అంటూ ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ పాత్ర కూడా ఉందట. మరి ఆ సైకో కిల్లర్ గా ఎవరు నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక దీనికోసం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న విశాల్ గాని లేదంటే శివ కార్తికేయన్ గాని ఈ సినిమాలో భాగం చేయడానికి రాజమౌళి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే క్యారెక్టర్ కి బాగా సరిపోతారంటూ వాళ్ళిద్దరిలొ ఒకరిని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడట.
అయితే ఈ పాత్ర సినిమాలో చాలా తక్కువ నిడివితో ఉంటుందట. కేవలం 15 నిమిషాల పాత్ర కావడంతో వాళ్లకి ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వాళ్ల సినిమాలను వాళ్ళు చేసుకుంటూనే ఈ సినిమాలో నటించడానికి అవకాశాన్ని కల్పించారట. మరి దాంతో వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళలో ఎవరిని ఫైనల్ చేస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి విజన్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే.
ప్రతి పాత్రని ఎలివేట్ చేస్తూ చూపించడంలో ఆయనను మించిన దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉండడానికి కూడా కారణం ఆయన సాధించిన విజయాలు ఆయనకున్న డెడికేషన్ అనే చెప్పాలి…