Thandel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక నాగచైతన్య(Naga Chaithanya) సైతం అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టడంలో కూడా చాలా కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన తండేల్ (Thandel) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల ఏడోవ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ లెవెల్లో చేస్తుండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తండేల్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి…
ఇక ఈ సినిమాని ‘తండేల్ రామారావు’ (Thandel Ramarao) అనే ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. తన కుటుంబంతో పాటు ఈవెంట్ కి హాజరయ్యాడు. అక్కడ తను మాట్లాడుతూ నేను చివరి వేట కి వెళ్ళాలి అనుకొని చేపల వేటకు వెళ్ళినప్పుడు నా భార్య ఏడు నెలల గర్భంతో ఉంది.
ఇక ఆ వేటలో భాగంగా నేను నా టీమ్ తో పాటు సముద్రంలోకి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో చేపలు అయితే పట్టాం…కానీ అనుకోకుండా మేము పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లడంతో మా గుండెజారి గల్లంతయినంత పని అయింది. ఇక అక్కడ ఉన్న పాకిస్థాన్ కోస్ట్ గాడ్స్ మమ్మల్ని పాకిస్తాన్ జైల్లో వేసి 17 నెలలపాటు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు. అయినప్పటికీ మేము ధైర్యం విడవకుండా ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగాము.
అందువల్లే మేము 17 నెలల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చామంటూ ఆయన చెబుతూ ఉండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ కథతో సినిమా చేయడం అనేది తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం విశేషం… నిజానికి తండేల్ అంటే లీడర్ అని అర్థం…చేపల కోసం వేటకు వెళ్లిన మెంబర్స్ మొత్తం తమ లీడర్ అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి తండేల్ రామారావు కాస్త తండేలు రాజు గా మార్చి ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి…
#Thandel Part 2 రావాలంటే.. నువ్వు మళ్ళీ పాకిస్థాన్ కి దొరకాలి
Real Bujji Talli to Real ThandelRaju pic.twitter.com/z9k2njOxdl
— Rajesh Manne (@rajeshmanne1) February 2, 2025