Tamil Star Directors: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఒకప్పుడు మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అరిస్తూ ఉండేవారు. వాళ్ల సినిమాలు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయాలను సాధించాయి. ఒకరకంగా చెప్పాలంటే మన తెలుగు హీరోలతో పాటు తమిళ్ హీరోలు కూడా ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు అంటే అక్కడి దర్శకులు ఆయా హీరోలకు అందించిన సక్సెసులే కారణమని చెప్పాలి. ఇక ఆ దర్శకులు వాళ్ళ సినిమాలను తెలుగులో డబ్ చేయడం వల్ల వాళ్లకి కూడా ఇక్కడ ఎనలేని గుర్తింపు అయితే వచ్చింది. వాళ్లు తెలుగులో కూడా మన స్టార్ హీరోలతో సినిమాలను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. ఇక ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ల పని అయిపోయింది. వాళ్ళు చేసిన ఏ సినిమాలు కూడా సక్సెస్ లను సాధించడం లేదు. మణిరత్నం, శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు ఒకప్పుడు మంచి సక్సెస్ లను సాధించారు. స్టార్ హీరోలు అందరూ వాళ్ళతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. వారి నుంచి వచ్చే ఏ సినిమా కూడా సక్సెస్ ని సాధించడం లేదు. శంకర్ చేసిన భారతీయుడు 2 (Bharathiyudu 2),గేమ్ చేంజర్ (Game Changer) సినిమాలు భారీ డిజాస్టర్లు గా మిగిలాయి. ఇక మురగదాస్ (Murugadas) డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా వచ్చిన సికిందర్ (Sikindhar)సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది.
Also Read: స్పిరిట్ లో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలిస్తే రోమాలు నిక్కబోడువాల్సిందే…
ఇక ఇప్పుడు మణిరత్నం (Manirathnam) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Hasan) హీరోగా వచ్చిన థగ్ లైఫ్ (Thag Life) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. మొదటి షో తోనే ఈ సినిమా మీద నెగెటివ్ టాక్ రావడంతో ఇప్పుడు అందరు ఈ సినిమా డిజాస్టర్ అవుతుంది అంటూ చెబుతున్నారు.
మరి ఎందుకని ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ఇప్పుడున్న ట్రెండ్ ని ఎందుకు అందుకోలేకపోతున్నారు అనే విషయం మీదనే పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక మరి కొంతమంది అయితే ఈ దర్శకులు తట్టబుట్ట సర్దుకొని సినిమాలు చేయకుండా ఇంటికి వెళ్లిపోవడం బెటర్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…
ప్రస్తుత ఈ జనరేషన్ కు తగ్గట్టుగా కథలను రాసుకోకపోవడం అప్పుడెప్పుడో వచ్చిన ఔట్ డేటెడ్ కథలతో సినిమాలను చేయడం వల్ల వాళ్ళ క్రేజ్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడున్న జనరేషన్ ప్రేక్షకులను అలరించడంలో కూడా చాలా వరకు వెనుకబడి పోతున్నారు. అందుకే వాళ్లకు ప్లాప్ లైతే వస్తున్నాయి…
Also Read: కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?