Rajinikanth vs NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇప్పటికే వరుసగా ఏడు విజయాలను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్టు గా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని చాలా గొప్ప స్టేజ్ కి అయితే తీసుకెళ్లాయి. ఇక ప్రస్తుతం ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ (Hruthik Roshan) కలిసి వార్ 2 (War 2) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న రజినీకాంత్ లాంటి నటుడు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఈయన లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraju) దర్శకత్వంలో చేస్తున్న కూలీ (Cooli) సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ లెక్కన ఎన్టీఆర్ కి, రజనీకాంత్ కు మధ్య భారీ పోటీ జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.వీళ్ళ మధ్య గల పోటీలో ఎవరు విజేతలు అవుతారు? ఎవరు ఓటమి పాలవుతారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయితే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందేనా..?
ముఖ్యంగా ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికి రెండు సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే ఉంది. ఈ రెండు సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు. వీలైతే ఒక్క రోజే ఈ రెండు సినిమాలను చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ రెండు సినిమాలు కూడా ఇతర భాషల నుంచి వస్తున్న సినిమాలే కావడం విశేషం.
తెలుగు నుంచి ఆగస్టు 14 న ఏ సినిమా రాబోతుంది అనే దానిమీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. కానీ వీలైనంత వరకు తెలుగు నుంచి ఒక సినిమా వస్తే బాగుండదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మొత్తానికైతే రజినీకాంత్ – ఎన్టీఆర్ మధ్య ఈ సినిమాల విషయంలో భీకరమైన పోటీ ఉంటుందనేది వాస్తవం…