Spirit Flashback Story: ఈశ్వర్(Eshwar) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్ (Prabhas)…మొదటి సినిమాతోనే రెబల్ స్టార్(Rebal Star) గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. వర్షం (Varsham) సినిమాతో స్టార్ హీరోగా మారడమే కాకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన మరెవరు లేరు అంటూ అతను అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజి (Fouji) అనే సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ(సందీప్ రెడ్డి Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ప్రభాస్ కి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండబోతుందట. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక మాఫియా లీడర్ గా కనిపిస్తారట. 20 సంవత్సరాల వయసులోనే ఆయన మాఫియాను రూల్ చేసే స్థాయికి ఎదుగుతారట…
ఇక అక్కడి నుంచి మాఫియాలో ఉన్న లుసుగులు మొత్తాన్ని తెలుసుకొని తనకు ఎదురైన శత్రువులందరిని చంపేసి మాఫియాను తన తండ్రికి గిఫ్ట్ గా ఇస్తారట. తన తండ్రి పాత్ర కూడా ఈ సినిమాలో పవర్ ఫుల్ గా ఉండబోతుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మాఫియా సామ్రాజ్యానికి తన ఫాదర్ ను డాన్ ను చేసి అప్పటి నుంచి అన్ని మంచి పనులు చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట. ఆ తర్వాత అనుకోకుండా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సి వస్తుంది.
మరి ఈ క్రమంలోనే తన తండ్రి మాఫియాలో తను పెట్టిన రూల్స్ కాకుండా కొత్త రూల్స్ పెట్టి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకొనా ప్రభాస్ ఆ మాఫియా సామ్రాజ్యాన్ని కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తారట. మొత్తానికైతే తండ్రి కొడుకుల మధ్య ఒక వారైతే నడవబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి తన తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసిన సినిమా ఇదే అంటూ ప్రభాస్ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు…