ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్యా

ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా?.. ఈ మహమ్మరి పీడ వదులుతుందా? అని ప్రపంచంలోని మానవళి అంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంది. వీరందరికీ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశంలో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సస్ అయ్యాయని ప్రకటించింది. త్వరలోనే మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ తీసుకురావడం జరుగుతుందని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. చైనాలోని వ్యూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి కకావికలం కావడంతో చాలాదేశాలు […]

Written By: Neelambaram, Updated On : July 13, 2020 3:13 pm
Follow us on


ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా?.. ఈ మహమ్మరి పీడ వదులుతుందా? అని ప్రపంచంలోని మానవళి అంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంది. వీరందరికీ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశంలో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సస్ అయ్యాయని ప్రకటించింది. త్వరలోనే మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ తీసుకురావడం జరుగుతుందని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

చైనాలోని వ్యూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి కకావికలం కావడంతో చాలాదేశాలు లాక్డౌన్ ను ఆశ్రయించాయి. దీంతో ఆయా దేశాలకు ప్రజారవాణా స్తంభించిపోయింది. ఈ నిర్ణయం వల్ల కొంతమేర కట్టడి అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. పనుల్లేక పెద్దఎత్తున నిరుద్యోగం పెరగడంతో ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ తరుణంలో చాలాదేశాలు కరోనాతో సహజీవనానికి పూనుకున్నాయి.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

కరోనాపై డబ్ల్యూహెచ్ఓ ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని ప్రజలే అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు సూచించింది. దీంతో ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనాపై పోరాటానికి సిద్ధమయ్యారు. మరోవైపు సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ కనుగోనేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. భారత్ ఇప్పటికే కరోనా డ్రగ్(మెడిసన్), ఇంజక్షన్ తయారుచేసి ముందంజలో నిలిచింది.

గ్లేన్ మార్క్ సంస్థ కరోనాకు మెడిసిన్ తయారుచేయగా హెటీరో సంస్థ కరోనా ఇంజెక్షన్ రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది. కరోనా మెడిసిన్ స్పల్ప లక్షణాలు ఉన్నవారిపై మాత్రమే పని చేస్తుందని ప్రకటించింది. దీంతో కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపు తప్పలేదు. ఇప్పటికే పలు భారత ఫార్మా కంపెనీలకు కేంద్రం వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చింది. జంతువులు, మనుషులపై ఒకేసారి ట్రయల్స్ చేపడుతూ వాక్సిన్ తయారీలో వేగాన్ని పెంచింది.

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

అయితే తాజాగా రష్యా తాము తయారీ చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సస్ అయినట్లు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. గమలీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌ వాలంటీర్లపై పరీక్ష చేయగా విజయవంతం అయినట్లు ఆ దేశానికి చెందిన సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. జూన్‌ 18నుంచి ఈ వ్యాక్సిన్‌‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించమని తొలి గ్రూప్‌ వాలంటీర్లపై ప్రయోగాలు విజయవంత అయ్యాయని వీరంతా బుధవారం(జులై 15) డిశ్చార్జ్ అవుతారని ప్రకటించింది.

జులై 20న రెండో గ్రూప్‌ వాలంటీర్లు డిశ్చార్జ్ అవుతారని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఇక చివరిదశలో భాగంగా వ్యాక్సిన్‌ భద్రతను పరీక్షించగా అది విజయవంతం అయినట్లు ప్రకటించారు. త్వరలోనే వ్యాక్సిన్‌ను రోగులకు అందుబాటులోకి వస్తుందని సెచోనోవ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి నుంచి వాక్సిన్ రేసులో రష్యా పేరు పెద్దగా విన్పించలేదు.

రష్యా సైలెంట్ గా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తిచేసి ముందంజలో నిలిచింది. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తొలి వ్యాక్సిన్ రష్యా నుంచే కావడం విశేషం. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి రానుందని ఆశాభావాన్ని రష్యా ప్రకటించడంతో మానవాళి గట్టిగా ఊపిరిపీల్చుకుంది.