Homeఎంటర్టైన్మెంట్Karthi Comments On Suriya: మా మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటూ సూర్య తో...

Karthi Comments On Suriya: మా మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటూ సూర్య తో రిలేషన్ గురించి కార్తీ హాట్ కామెంట్స్..

Karthi Comments On Suriya: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న హీరో సూర్య , ఇప్పుడు లేటెస్ట్ గా ‘కరప్పు’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. తెలుగు లో ఈ సినిమా ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. తమిళనాడు లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెట్టగా, ఆడియన్స్ నుండి కావాల్సినంత రెస్పాన్స్ మాత్రం రావడం లేదు. ఇకపోతే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సొంతం చేసుకుంది. సూర్య ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ లక్కీ హ్యాండ్ అనే చెప్పాలి. గతంలో ఈ సంస్థ కొనుగోలు చేసిన ‘ఖైదీ’, ‘సర్దార్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి సూర్య తో పాటుగా , ఆయన తమ్ముడు కార్తీ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం కార్తీ మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో కలిసి ఒక సినిమా హైదరాబాద్ లో చేస్తున్నాడు, ఎలాగో హైదరాబాద్ లోనే ఈవెంట్ జరుగుతుంది కాబట్టి , సూర్య పిలవగానే వచ్చేశాడు. అయితే ఈ ఈవెంట్ లో వీళ్ళిద్దరితో యాంకర్ సుమ జరిపిన ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. యాంకర్ సుమ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు కార్తీ మీద బాగా కోపం వచ్చినప్పుడు ఏమని తిడుతారు’ అని సూర్య ని అడగ్గా, దానికి కార్తీ మైక్ అందుకొని ‘మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి, తిట్లు ఉండవు, కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

మీ ఇద్దరిలో మీ అమ్మ గారికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అని సుమ కార్తీ ని అడగ్గా, కచ్చితంగా మా అన్నయ్యే , పెద్ద బాబు కదా ఎంతైనా అంటూ చెప్పుకొచ్చాడు కార్తీ. ఇద్దరిలో ఎవరికీ కోపం ఎక్కువ అని అడగ్గా, మా అన్నయ్యకే కోపం ఎక్కువ, కానీ దెబ్బలు మా చేతిలో ఎక్కువగా నాకే పడేవి అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా వీళ్ళ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అయితే ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు తెలుగు రాదు అని చెప్పడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య , ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడో లేదో తెలియాలంటే మే 14 వరకు ఆగాల్సిందే.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular