spot_img
Homeఎంటర్టైన్మెంట్Jai Bhim Telugu Movie Review: జై భీమ్‌ రివ్యూ

Jai Bhim Telugu Movie Review: జై భీమ్‌ రివ్యూ

నటీనటులు: సూర్య, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రాజిష విజయన్‌, లిజోమోల్‌ జోసీ, మణికంఠన్‌ తదితరులు;
రచన, దర్శకత్వం: త.శె.జ్ఞానవేల్‌;
సంగీతం: షాన్‌ రొనాల్డ్‌;
ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌;
సినిమాటోగ్రఫీ: ఎస్‌.ఆర్‌.కాదిర్‌;
నిర్మాత: సూర్య, జ్యోతిక;
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

Jai Bhim Telugu Movie Review
Jai Bhim Telugu Movie Review

త.శె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో వచ్చిన కోర్టు రూమ్‌ డ్రామా ‘జై భీమ్‌’. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ :

చంద్రు(సూర్య) ఒక సీరియస్ అడ్వొకేట్‌. అయితే రాజన్న(మణికందన్‌) గిరిజనుడు. పైగా అతను నిజాయతీపరుడు కూడా. కానీ అలాంటి వ్యక్తి పై ఓ తప్పుడు కేసు నమోదు అవుతుంది. ఓ స్థానిక రాజకీయ నాయకుడి ఇంట్లో రాజన్న దొంగతనం చేశాడని పోలీసులు కేసు నమోదు చేస్తారు. నేరం ఒప్పుకోమని తీవ్రంగా కొడతారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం.. రాజన్న జైలు నుంచి తప్పించుకున్నాడని అతడి భార్య చిన్నతల్లి(లిజో మోల్‌ జోసే)కు చెబుతారు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. ఈ విషయంలో ఆమెకు అడ్వొకేట్‌ చంద్రు(సూర్య) సాయం చేస్తాడని తెలుస్తుంది. చంద్రు కూడా ఆమెకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

దర్శకుడు న్యాయ వ్యవస్థకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నాడు. ముఖ్యంగా లాయర్‌ సూర్య ఓ క్లిష్టమైన కేసును టేకప్‌ చేసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు, అలాగే ఆ సమస్యలను పరిష్కరించేందుకు అతను సేకరించే ఆధారాలు, వాటి కోసం చేసే రిస్కీ షాట్స్.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పై ఎత్తులు ఇలా ఈ సినిమాలో కొన్ని అంశాలు బాగా ఆకట్టుకుంటాయి.

ఐతే దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. కీలకమైన ఎమోషన్స్ అన్నీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు సాగాయి. సినిమాకి ఇవి పెద్ద మైనస్ అయ్యాయి. అసలు పోలీసులు ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తారు ? అనే అనుమానం కూడా సినిమా చూసే ప్రేక్షకుల్లో కలుగుతుంది.

కాకపోతే దర్శకుడు జ్ఞానవేల్‌ కథా, కథనాలను నడిపించిన తీరు కట్టిపడేస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ బాగున్నా సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా చూపించొచ్చు. ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సూర్య నటన,
మెసేజ్, డైలాగ్స్,
కొన్ని ఎమోషనల్ సీన్స్
సాంకేతిక వర్గం పనితీరు

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ నెమ్మదించిన కథాగమనం
ఇంట్రెస్ట్ లేని కొన్ని సీన్స్,
ఫస్ట్ హాఫ్.

సినిమా చూడాలా ? వద్దా ?

‘జై భీమ్‌’ అంటూ వచ్చిన ఈ సీరియస్ ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకులను కొన్ని అంశాల్లో మెప్పిస్తోంది. ఇలాంటి సీరియస్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాని చూడొచ్చు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper