Republic Movie: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజున బైక్ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆయనకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ను ప్రకటించారు.
విలక్షణ దర్శకుడు దేవకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం “రిపబ్లిక్”. ఈ మూవీ అక్టోబర్ 1న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో తేజ్ ఐఎస్ అధికారిగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు తేజ్ బైక్ ప్రమాదానికి గురికావడంతో మూవీ ప్రచారంలో కూడా తేజ్ పాల్గొనలేదనే చెప్పాలి. ఈ తరుణం లోనే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక సంధర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమరాన్ని రేపయో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకు పోసాని కూడా స్పంధించి రచ్చ కెక్కారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ5 సంస్థ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ చిత్రాన్ని ఈ నెల 26న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sai dharam tej republic movie releasing on zee 5 ott
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com