చిన్నారి పెళ్లికూతురు బామ్మ ఇక లేరు

హిందీలో బుల్లితెరను ఊపు ఊపేసిన సీరియల్ ‘బాలికా వధు’. తెలుగులో ఇది చిన్నారి పెళ్లికూతురు పేరుతో అనువాదం అయ్యింది. తెలుగులోనూ ప్రేక్షకుల మన్ననలు పొంది టాప్ సీరియల్ గా పేరు పొందింది. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో నేషనల్ అవార్డు పొందింది అందులో బామ్మగా నటించిన సురేఖ సిక్రి. 75 ఏళ్ల ఈ బామ్మ సురేఖ తాజాగా ఈరోజు కన్నుమూసింది. సురేఖ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. నటిగా ఎన్నో మైలురాళ్లు అందుకున్న సురేఖ మరణం బాలీవుడ్ లో […]

Written By: NARESH, Updated On : July 16, 2021 3:16 pm
Follow us on

హిందీలో బుల్లితెరను ఊపు ఊపేసిన సీరియల్ ‘బాలికా వధు’. తెలుగులో ఇది చిన్నారి పెళ్లికూతురు పేరుతో అనువాదం అయ్యింది. తెలుగులోనూ ప్రేక్షకుల మన్ననలు పొంది టాప్ సీరియల్ గా పేరు పొందింది.

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో నేషనల్ అవార్డు పొందింది అందులో బామ్మగా నటించిన సురేఖ సిక్రి. 75 ఏళ్ల ఈ బామ్మ సురేఖ తాజాగా ఈరోజు కన్నుమూసింది. సురేఖ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. నటిగా ఎన్నో మైలురాళ్లు అందుకున్న సురేఖ మరణం బాలీవుడ్ లో తీవ్ర విషాదం నింపింది. కొద్దిరోజుల క్రితం సురేఖకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లగా.. బాత్రూమ్ లో ఆమె కాలు జారి కిందపడిపోయింది. ఆ సమయంలో సురేఖ తలకు గాయమైంది.

చికిత్స అనంతరం కోలుకున్నట్లు సురేఖ బంధువులు తెలిపారు. అయితే తాజాగా గుండెపోటుతో మరణించడంతో విషాదం అలుముకుంది. 75వ ఏట ఆమె కన్నుమూశారు.

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ కు గాను సురేఖ సిఖ్రికి చాలా పేరు వచ్చింది. జాతీయ స్థాయిలో మార్మోగింది. ఈ సీరియల్ అన్ని భాషల్లోనూ అత్యంత ఆదరణ పొందింది. అలా సురేఖ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైంది. చివరగా ‘ఆంథాలజీ ఘెస్ట్ స్టోరీస్’ చిత్రంలో నటించారు.

ఇక కెరీర్ లో మూడు సార్లు ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డులను అందుకుంది సురేఖ సిఖ్రి. బాలీవుడ్ లో ఆమె పలు చిత్రాల్లో కూడా నటించింది. చేసింది చిన్న పాత్రలేఅయినా.. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో జీవించింది.

ప్రముఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆమె గ్రాడ్యూయేషన్ చేశారు. మూడు దశాబ్ధాలుగా నటనలో రాణిస్తున్నారు. ‘జుబేదా, మిస్టర్ అండ్ మిసెస్, ఐయ్యర్ అండ్ రైన్ కోట్’ వంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.