Supritha: నటిగా ఆఫర్స్ తగ్గడంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సురేఖావాణి. పనిలో పనిగా తన టీనేజ్ డాటర్ ని కూడా పరిచయం చేసింది. సురేఖావాణి కూతురు పేరు సుప్రీత కాగా సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. సురేఖావాణి, సుప్రీత కలిసి డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటో షూట్స్ చేసేవారు. ఆ విధంగా సుప్రీత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఆమె అకౌంట్ ని లక్షల్లో ఫాలో కావడం మొదలైంది. అప్పుడప్పు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ మరింత ఫేమ్ రాబట్టింది. సుప్రీత ఫైర్ బ్రాండ్ కూడాను. తన తల్లిపై వచ్చే పుకార్లకు ధీటుగా జవాబు ఇస్తుంది. అప్పట్లో వచ్చిన రెండో పెళ్లి వార్తలపై సుప్రీత మండి పడింది.
Also Read: తొలి సినిమా భారీ హిట్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు.. ఈ హాట్ బ్యూటీ ని గుర్తుపట్టారా..
ఈ మధ్య టెలివిజన్ షోలలో కూడా సుప్రీత సందడి చేస్తుంది. పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అక్కడ కూడా తన గ్లామరస్ లుక్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. సుప్రీత హీరోయిన్ గా ఓ చిత్రం చేస్తుంది. సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరికి జంటగా ఆమె నటిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న అమర్ దీప్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, కొంచెం లో టైటిల్ చేజారింది.
బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్ అమర్ దీప్ కి హీరో ఆఫర్ తెచ్చిపెట్టింది. ఇక అమర్ దీప్ సినిమాలో సుప్రీత హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సినిమా విడుదల కాకుండానే అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది.
తరచుగా సుప్రీత, సురేఖావాణి వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు. తమ విహారయాత్రల ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు. సమ్మర్ కావడంతో సుప్రీత సాగర తీరానికి చెక్కేసింది. చల్లని బీచ్ లో సేద తీరుతుంది. బీచ్ పక్కన ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. సుప్రీత లేటెస్ట్ లుక్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Also Read: పోక్సో కేసు పెట్టాలి… కీరవాణి పై సీనియర్ డైరెక్టర్ సంచలన కామెంట్స్