Homeఎంటర్టైన్మెంట్Surekha Vani Daughter: ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు సుప్రీత... గ్లామర్ షోకి...

Surekha Vani Daughter: ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు సుప్రీత… గ్లామర్ షోకి కుర్రాళ్లు పరేషాన్!

సురేఖావాణి టాలీవుడ్ సీనియర్ నటి. రెండు దశాబ్దాలకు పైగా ఆమె పరిశ్రమలో కొనసాగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తన మార్కు క్రియేట్ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల సినిమాల్లో సురేఖావాణి చేసిన పాత్రలకు మంచి ఆదరణ దక్కింది. రెడీ, నమో వెంకటేశా, బాద్షా, దుబాయ్ శీను చిత్రాల్లో సురేఖావాణి చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాగా సురేఖావాణి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త 2019 అనారోగ్యంతో మరణించాడు. దాంతో కొన్నాళ్లు ఆమె బ్రేక్ తీసుకున్నారు.

ఈ లోగా లాక్ డౌన్ వచ్చింది. దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు సురేఖావాణిని మర్చిపోయారు. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. నాకు అవకాశాలు ఇవ్వడం లేదని ఓ సందర్భంలో సురేఖావాణి అసహనం వ్యక్తం చేసింది. సురేఖావాణి తెలివిగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉండటం ప్రారంభించింది. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మరలా వెలుగులోకి వచ్చింది.

Also Read: Prabhas: ప్రభాస్ తో మల్టీ స్టారర్ సినిమాకి సై అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో…

పనిలో పనిగా కూతురు సుప్రీతను కూడా పాపులర్ చేసింది. సురేఖావాణి తరచుగా కూతురు సుప్రీతతో డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటో షూట్స్ చేసేది. అవి కాస్తా వైరల్ కావడంతో సుప్రీత సోషల్ మీడియా సెలెబ్ గా అవతరించింది. సుప్రీత సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేస్తుంది. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఈ క్రమంలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. సుప్రీతను హీరోయిన్ చేయాలన్న సురేఖావాణి కల నెరవేరింది.

Also Read: Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారంటే..?

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తుంది సుప్రీత. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ విజయం సాధిస్తే సుప్రీత హీరోయిన్ గా పరిశ్రమలో బిజీ అయినట్లే. తాజాగా సుప్రీత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ట్రెండీ వేర్లో ప్రైవేట్ పార్టీకి హాజరైన సుప్రీత మిర్రర్ సెల్ఫీలు తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె గ్లామర్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha (@_supritha_9)

RELATED ARTICLES

Most Popular