https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: యావర్ చేతిలో సూపర్ పవర్… అర్జున్ కి ఫైనల్ ఆశలు గల్లంతు!

పూల్ పజిల్ టాస్క్ లో అర్జున్ సత్తా చాటాడు.ఎవిక్షన్ పాస్ గెలిచాడు. ఇంతలోనే ' అర్జున్ మీరు మీ ఏవిక్షన్ పాస్ ని డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ' అని మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2023 / 06:03 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే దాదాపు 80 శాతం ఆట పూర్తి కావడంతో .. హౌస్ లో టాప్ 10 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. కాగా వాళ్ళు ఎవరు ఏ స్థానం అనేది తేల్చుకోవాలని బిగ్ బాస్ ర్యాంకింగ్ టాస్క్ ఇచ్చారు. ఇక ఎవరి స్థానాలు వారు కేటాయించుకున్నారు. కాగా మొదటి ఐదు స్థానాల్లో శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏవిక్షన్ పాస్ కోసం పోటీ పడేందుకు బాటమ్ ఫైవ్ లో ఉన్న .. అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక లకు అవకాశం కల్పించారు.

    పూల్ పజిల్ టాస్క్ లో అర్జున్ సత్తా చాటాడు.ఎవిక్షన్ పాస్ గెలిచాడు. ఇంతలోనే ‘ అర్జున్ మీరు మీ ఏవిక్షన్ పాస్ ని డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ‘ అని మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగా తాజా ప్రోమోలో .. టాప్ 5 సభ్యులతో పోటీపడి .. ఎవిక్షన్ పాస్ ను డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది.. గేమ్ లో ఓడిపోయిన సభ్యులు మొత్తానికి రేస్ నుంచి తప్పుకుంటారు అని బిగ్ బాస్ ప్రకటించారు.

    ఈ ఛాలెంజ్ కోసం ప్లాట్ ఫామ్ పై ఐదు బాల్స్ ని బాలన్స్ చేయాలని చెప్పారు. దీంతో అర్జున్ -యావర్ ని అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. అమర్ దీప్ సంచాలక్ గా వ్యవహరించాడు. ఈ టాస్క్ లో ప్రిన్స్ యావర్ విజయం సాధించాడు. ఇక టాస్క్ ముగిసిన తర్వాత అర్జున్,అశ్విని,రతిక మధ్య డిస్కషన్ జరిగింది. ‘ అమర్ ఏమన్నా మాట్లాడతాడు అనుకున్న’ అంటూ రతిక అర్జున్ తో చెప్పింది.

    ‘ అమర్ కూడా ఏం చెయ్యలేడు.. రెండు కాళ్ళు పైనుండాలి .. కాళ్ళు పైన పెడుతున్నాడు కానీ .. అర్జున్ లాగ గేమ్ ఆడలేదు’ అంటూ అశ్విని చెప్పింది. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ రతిక అనడం తో .. ‘ నేను చీటింగ్ చేస్తే .. నేను చెప్తా కెమెరా ముందు .. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు అంటూ శివాజీ తో చెప్పాడు యావర్. వాళ్లకు ఆ ఫీలింగ్ ఉందా … ఎందుకు ఇలా తయారైంది అంటూ శివాజీ అన్నాడు.