Sukumar Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి… పుష్ప 2(Pushpa 2) సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్న ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇప్పుడు ఆయన ఏ సినిమా చేసినా కూడా 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ కాళేశ్కహ్నా తగ్గితే మాత్రం ఆయన ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన రామ్ చరణ్ (Ram Charan) తో ఒక సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. అయితే వీళ్ళ కాంబోలో ఇంతకు ముందే రంగస్థలం అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే… అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా రాదా అనేది దాని మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
Also Read: ప్యారడైజ్ లో నాని అన్నగా నటిస్తున్న స్టార్ హీరో…ఇది వేరే రేంజ్ లో ఉందిగా…
ఎందుకంటే రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టులను వేరే డైరెక్టర్లతో అనుకుంటున్నారు. ఇంకా సుకుమార్ సైతం ఈ ప్రాజెక్టుని పక్కనపెట్టి షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే మాత్రం సుకుమార్ స్పందించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక దాంతో పాటుగా సుకుమార్ చేయబోతున్న సినిమాల లిస్టు కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తానని కమిట్ అయినప్పటికీ ఆ సినిమా స్టోరీ అంత పర్ఫెక్ట్ గా కుదరకపోవడంతో ఆయన పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఆయన ఏ హీరోతో చేయబోతున్నాడు ఏ హీరో ఖాళీగా ఉన్నాడు అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి…
Also Read: అట్లీ మూవీలో అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న స్టార్ హీరో…
ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీగా వ్యవహరించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుంది అనేది…