https://oktelugu.com/

Sukumar : సుకుమార్ కోసం టైమ్ వేస్ట్ చేసుకున్న స్టార్ హీరో…

Sukumar : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోలు మాత్రం కొంతమందే ఉన్నారు.

Written By: , Updated On : March 20, 2025 / 01:40 PM IST
Sukumar

Sukumar

Follow us on

Sukumar : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోలు మాత్రం కొంతమందే ఉన్నారు. అందులో తెలుగు హీరోలు ప్రథమంగా ఉండడం విశేషం… ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారనే చెప్పాలి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్(Sukuma)… ఈయన చేస్తున్న సినిమాలు వరుస విజయాలను సాధిస్తున్నాయి. ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పిస్తూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా పుష్ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా పుష్ప 2 (Pushpa 2) సినిమాను నిలిపారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిందనే చెప్పాలి. ఆయన రామ్ చరణ్ హీరోగా మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక రంగస్థలం సినిమా సమయంలోనే ఆయన విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు.

Also Read : రామ్ చరణ్ సినిమాల్లో సుకుమార్ కి బాగా నచ్చిన సినిమాలు…

విజయ్ తో సినిమా ఉంటుందంటూ అనౌన్స్ కూడా చేశాడు. దానికి తగ్గట్టుగానే విజయ్ కూడా సుకుమార్ కోసం ఎదురు చూశాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు అయితే క్యాన్సిల్ అయింది. నిజానికి సుకుమార్ సినిమా చేస్తున్నానని విజయ్ దేవరకొండ వేరే దర్శకుల సినిమాలను రిజెక్ట్ చేశాడు.

కానీ సుకుమార్ మాత్రం చివరికి హ్యాండ్ ఇవ్వడంతో ఆయన ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanuri) డైరెక్షన్ లో ‘కింగ్ డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన హీరో స్టార్ హీరోగా మారడానికి చాలా అవకాశాలైతే ఉన్నాయి. ఇక సుకుమార్ డైరెక్షన్ లో ఆయన సినిమా చేసి ఉంటే ఈజీగా స్టార్ హీరోగా మారిపోయేవాడు. కానీ ఆయన మీడియం రేంజ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

మరి కింగ్ డమ్ సినిమాతో భారీ విజయాన్ని సాధించి స్టార్ హీరోల లిస్టులో చేరిపోతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటివరకు విజయ్ దేవరకొండ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు కానీ స్టార్ హీరో అవ్వాలంటే మాత్రం ఇండస్ట్రీ షేక్ అయ్యే విధంగా సక్సెస్ లను సాధించాల్సిన అవసమైతే ఉంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది చూడాలి…

Also Read : షారుఖ్ ఖాన్ తో సుకుమార్..మరి రామ్ చరణ్ సంగతేంటి?