Srileela
Srileela : టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన హీరోయిన్స్ లో ఒకరిగా శ్రీలీల(Heroine Srileela) కూడా నిల్చింది. ఈమె ‘పుష్ప 2′(Pushpa 2) లోని కిస్సిక్ పాటతో బాగా పాపులర్ అయ్యింది. ఈ పాట పెద్ద హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా ఆమెకు సినిమా అవకాశాలు వరుసగా క్యూలు కడుతున్నాయి. తెలుగు భాషలో ఈమె చేసిన సినిమాలలో ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ తప్ప అన్ని అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. నేడు విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రానికి కూడా ఓపెనింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. టాక్ కూడా యావరేజ్ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంది. ఇలా టాలీవుడ్ లో ఆమెకు వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ, ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆమె మాత్రం తన ద్రుష్టి మొత్తాన్ని బాలీవుడ్ వైపే పెట్టింది.
Also Read : స్టార్ హీరో కొడుకుతో ప్రేమాయణం..ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ శ్రీలీల!
సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim ali khan) తో ఇప్పటికే ఒక సినిమా చేస్తున్న శ్రీలీల, ప్రముఖ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో కూడా ఒక సినిమా చేస్తుంది. బాలీవుడ్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసిన ఆషికీ సిరీస్ లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ‘ఆషికీ 3’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటోని శ్రీలీల తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలో ఆమె హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి టీ త్రాగడానికి కూర్చుంది. అతన్ని నేరుగా చూడలేక సిగ్గు తో తలదించుకున్నట్టుగా ఉన్నటువంటి ఈ ఫోటోకి ‘నువ్వే నా జీవితం’ అని ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
ఇదంతా పక్కన పెడితే శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ లో ఒక ప్రచారం వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. రీసెంట్ గానే కార్తీక్ ఆర్యన్ తల్లి ఒక ఈవెంట్ కి వెళ్లగా, అక్కడ హోస్ట్ ఆమెతో సంభాషిస్తూ త్వరలోనే ఒక డాక్టర్ పిల్ల మీ ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టబోతుంది కదా అని అంటాడు. దానికి కార్తీక్ ఆర్యన్ తల్లి నవ్వుతూ సమాధానం దాటవేసింది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే శ్రీలీల కూడా ఈ రూమర్స్ పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో రిలేషన్ నడుస్తుంది అనే టాక్ వైరల్ అయ్యింది. చూడాలి మరి నిజంగానే వీళ్లిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అనేది.
Also Read : శ్రీలీల కి అంత సీన్ లేదు..ఆమె వల్లే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అంటూ ‘ధమాకా’ రచయిత షాకింగ్ కామెంట్స్!