Sudigali Sudheer: బుల్లితెరపై తనదైన మార్క్ కామెడీతో సుడిగాలి సుధీర్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. యాక్టింగ్ కంటే రష్మి తో లవ్ ట్రక్ తో ఎక్కువ పాపులర్ అయ్యారు. జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఈటీవీకి దూరమయ్యారు సుధీర్. సినిమాలతో పాటు వేరే ఛానళ్ల లో కీలక ప్రాజెక్టులు చేశారు. దీంతో తన మాతృ సంస్థకు దూరంగా ఉండేవారు. అయితే ఆయన తాజాగా ఈటీవీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈటీవీ 28 ఏళ్ల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. రష్మీతో వేదిక పంచుకోనన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి.. సుధీర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. కేవలం నటుడిగానే కాకుండా మంచి డాన్సర్ గా, వ్యాఖ్యాతగా, మ్యాజిక్ షో లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ లో వెలుగొందాడు. అలాంటి సుధీర్ ఈటీవీ కి కొద్దిరోజుల పాటు దూరం కావడం పెద్దలోటే.
వాస్తవానికి బుల్లితెర హిట్ ఫెయిర్ అని ఎవరినైనా అడిగితే వచ్చే సమాధానం సుధీర్, రష్మి అని. తెలుగు చిత్ర సీమలో చిరంజీవి, విజయశాంతి… వెంకటేష్,సౌందర్య.. నాగార్జున,రమ్యకృష్ణ లాంటి హిట్ ఫెయిర్ ల మాదిరిగా సుధీర్, రష్మీ జంట బుల్లితెరపై కెమిస్ట్రీ పండించారు. అయితే ఆ జంట ఈటీవీ 28వ వార్షికోత్సవ వేడుకల్లో మరోసారి అలరించనుందని తెలియడంతో.. అభిమానులు ఆనంద పడుతున్నారు. కార్యక్రమం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.