Renu Desai: పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఓ విమర్శ చేస్తుంటారు. మూడు పెళ్లిళ్లతో పాటు ప్యాకేజీ స్టార్ అని ఆరోపిస్తుంటారు. ఆయన వైవాహిక జీవితం పై సినిమాలు తీస్తామని కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన వీడియో విడుదల చేశారు. పవన్ వ్యక్తిత్వం, ఆయన రాజకీయ ఆశయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ వీడియో వైరల్ అవుతోంది.
రేణు దేశాయ్ పవన్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రెండో భార్య గా ఉన్న రేణు దేశాయ్ పవన్తో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. పవన్ పై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇకనైనా వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి పేరదించాలని తాను వీడియోతో ముందుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

పవన్ చాలా అరుదైన వ్యక్తి అని.. రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. అంతేకాకుండా బ్రో సినిమాలో శ్యాంబాబు వివాదం పైన ఆమె స్పందించారు.’ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన అరుదైన వ్యక్తి. ఆయన మనీ మైండెడ్ కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పనిచేయాలనుకుంటున్నారు. ఆయనకు పొలిటికల్ గా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటా. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవలను గుర్తించండి. ఆయనొక సక్సెస్ఫుల్ నటుడు. ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు.దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి.వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి.మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు.. మిగిలిన ఇద్దరు పిల్లలను అలాంటి వాటిలోకి లాగకండి ‘.. అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియాలో విజ్ఞప్తి చేశారు.
ఇటీవల బ్రో సినిమా వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యక్తిగత జీవితం పై సినిమా తీస్తామని వైసిపి నేతలు హెచ్చరించారు కూడా. దీనిపైన కూడా రేణు దేశాయ్ స్పందించారు. బ్రో సినిమా వివాదం గురించి నాకు తెలియదు. కానీ పవన్ వ్యక్తిగత జీవితం పై సినిమాలు తీస్తామని కొందరు ప్రకటించారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏవైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి అని రేణు దేశాయ్ కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram