Sudheer : హిందూ మతం పై, సనాతన ధర్మం పై, హిందూ దేవుళ్లపై ఇప్పుడు ఎవరైనా సరే ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాలు కూడా ఈమధ్య కాలం లో ఇలాంటి సంఘటనలపై అసలు ఉపేక్షించడం లేదు. ఏ స్థాయికి వెళ్ళింది అనేది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ప్రముఖ టీవీ స్టార్ సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఒక ఎంటర్టైన్మెంట్ షోలో పాల్గొన్నాడు. త్వరలో జీ తెలుగు లో ప్రసారం అవ్వబోయే డ్రామా జూనియర్స్(Drama Juniors) సరికొత్త సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న ఆయన, ప్రొమోషన్స్ లో భాగంగా ఈ షోకి విచ్చేశాడు. ఈ షోకి సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ(Heroine Rambha) కూడా ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఆమెతో కలిసి సుధీర్ చేసిన సందడి ప్రేక్షకులను బాగా అలరించింది కానీ, ఎప్పుడైతే ఆయన ఆమెతో స్కిట్ చేసాడో అది ఇప్పుడు తీవ్రమైన విమర్శలకు గురయ్యేలా చేస్తుంది.
Also Read : సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదా..? లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, రంభ కాంబినేషన్ లో బావగారు బాగున్నారా అనే సూపర్ హిట్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంటర్వెల్ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చిరంజీవి శివాలయం లో నందీశ్వరుడు నుండి శివుడి చూడాలనుకుంటే మధ్యలో రంభ వస్తుంది. ఈ సన్నివేశాన్ని మరోసారి రీ క్రియేట్ చేస్తూ సుడిగాలి సుధీర్, రంభ ఒక స్కిట్ చేశారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియా లో కూడా నెటిజెన్స్ మండిపడుతున్నారు. నందీశ్వరుడు కొమ్ముల వైపు నుండి చూస్తే కేవలం శివుడు మాత్రమే కనిపించాలి, మీకు ఇష్టమొచ్చినట్టు మార్చేసుకొని హీరోయిన్ కనిపించడం ఏమిటి?, అసలు ఎంటర్టైన్మెంట్ షో కి నందీశ్వరుడు బొమ్మని తీసుకొని వచ్చి ఇలాంటి వాటికి వాడుకోవడం ఏమిటి?, హిందూ దేవుళ్ళు అంటే కామెడీ అయిపోయిందా మీకు అంటూ విరుచుకుపడ్డారు.
సుడిగాలి సుధీర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతో క్రింది స్థాయి నుండి ఇండస్ట్రీ లోకి పైకి ఎదిగిన వ్యక్తి. అందరితో ఎంతో వినయంగా, మర్యాదగా ఉంటాడు. ముఖ్యంగా మన సంప్రదాయాలను గౌరవించే వక్తి. అలాంటి మనిషి కావాలని ఉద్దేశపూర్వకంగా ఏది చెయ్యడు. కేవలం ఒక ఫన్నీ స్కిట్ లో భాగంగానే ఆయన ఇలా చేసి ఉండొచ్చు కానీ, నెటిజెన్స్ మాత్రం సీరియస్ అయ్యారు. మరి దీనిపై సుధీర్ రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి . ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సన్నివేశాన్నే కదా ఇప్పుడు రిపీట్ చేశారు, ఆయన చేస్తే తప్పు అవ్వనప్పుడు, సుధీర్ చేస్తే తప్పు ఎందుకు అవుతుంది అని కొంతమంది వాదన. అది సినిమాలోని ఒక్క సన్నివేశం మాత్రమేనని, ఎలాంటి అపవిత్రం అక్కడ జరగలేదని, కానీ ఇక్కడ నందీశ్వరుడిని తీసుకొచ్చి వాళ్లకు ఇష్టమైన చోట పెట్టుకొని స్కిట్స్ చేసారని, ఇది క్షమించరాని నేరమని మరికొంతమంది అంటున్నారు.
Also Read : విశ్వక్ సేన్ కి చుక్కలు చూపించిన సుడిగాలి సుధీర్..దెబ్బకి షో నుండి అవుట్..అసలు ఏమైందంటే!
సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్
బావగారు బాగున్నారా సినిమా సీన్ ను రీక్రియేట్ చేసిన సుధీర్
నంది కొమ్ముల్లో నుంచి చూస్తే రంభ కనిపించేలా సీన్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుధీర్ స్కిట్
సుడిగాలి సుధీర్ స్కిట్ పై మండిపడుతున్న హిందూ సంఘాల నేతలు
శివుడితో పరాచకాలా అంటూ ఆగ్రహం pic.twitter.com/6AwLlHXJbM
— BIG TV Breaking News (@bigtvtelugu) April 9, 2025