Sudigali Sudheer
Sudigali Sudheer : సిల్వర్ స్క్రీన్ పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు ప్రభాస్(Rebel Star Prabhas) అయితే, బుల్లితెర పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు సుడిగాలి సుధీర్. ఎంటర్టైన్మెంట్ షోస్ ని అనుసరించే ప్రతీ ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. మ్యాజిక్ షోస్ ద్వారా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని సంపాదించాడు. అలా మొదలైన సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) ప్రస్థానం అనతి కాలం లోనే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ యాజమాన్యం ని మెప్పించి ఒక టీం ని లీడ్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇక ఆ తర్వాత సుధీర్ ప్రయాణం మనమంతా కళ్లారా చూసాము. బుల్లితెర షోస్ నుండి వెండితెర పై హీరో గా ఎదిగే రేంజ్ కి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో సుధీర్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : హాస్పిటల్ పాలైన సుడిగాలి సుధీర్..ముదురుతున్న అనారోగ్య సమస్యలు.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!
సుధీర్ అనే పేరు తీస్తే ఆయనతో పాటు మనకు గుర్తుకు వచ్చే పేరు రష్మీ. బుల్లితెర ఆన్ స్క్రీన్ పై వీళ్లిద్దరి జోడీ పెద్ద బ్లాక్ బస్టర్. వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే, వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేస్తారు. కానీ మేము కేవలం స్నేహితులం మాత్రమే అని, మేము ఫోన్ కాల్ సంభాషణ జరుపుకోవడం వంటివి కూడ చాలా అరుదుగా చేస్తుంటాము. ఏదైనా అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతుంటాము అని చెప్పుకొస్తారు కానీ, వీళ్ళ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఎదో ఒక రోజు వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని మన ముందుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తారని అంతా అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ప్రముఖ కమెడియన్ ధనరాజ్ సతీమణి శిరీష మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘ సుధీర్ తో మా కుటుంబానికి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. నన్ను వదినా అని ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉంటాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది సుధీర్ ని టీవీ లో చూసినప్పుడు ఇతను పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అడుగుతూ ఉంటారు. నేను చూసిన సుధీర్ అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే మనస్తత్వం లో లేడు. పెళ్లి అంటే కచ్చితంగా ఒకే దగ్గర స్టక్ అయిపోవాల్సి ఉంటుంది. అది సుధీర్ కి ఇష్టం లేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాడేమో నాకు తెలియదు కానీ, ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక సుధీర్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఆయన ఈటీవీ లోకి రీ ఎంట్రీ ఇచ్చి ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. అంతే కాకుండా ఆయన చేతిలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా కూడా ఉంది.
Also Read : విశ్వక్ సేన్ కి చుక్కలు చూపించిన సుడిగాలి సుధీర్..దెబ్బకి షో నుండి అవుట్..అసలు ఏమైందంటే!