Sudigali Sudheer: ఈటీవీ లో ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్’ ప్రోగ్రాం మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సుడిగాలి సుధీర్ బుల్లితెర పై ఈ షో తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోలో శ్రవంతి, అషు రెడ్డి వంటి వారు కూడా కో యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ వారం సరికొత్త సెలబ్రిటీస్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఈ షో సాగుతుంది. ఈ వారం ఈ షోకి ముఖ్య అతిథి గా యంగ్ హీరో విశ్వక్ సేన్ విచ్చేశాడు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లైలా’ ఈ నెల 14వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ సేన్ ఈ ప్రోగ్రాం కి విచ్చేశాడు. ఆయన సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన హంగామా హైలైట్ అయ్యింది.
ఈ ఎపిసోడ్ ప్రారంభం లో విశ్వక్ సేన్ రాగానే లైలా మూవీ ట్రైలర్ వేస్తారు. అది చూసిన వెంటనే ట్రైలర్ లో అమ్మాయి ఎవరన్నా అంత బాగుంది, ఆమె నెంబర్ ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. ఆ అమ్మాయి గెటప్ లో కనిపించిన వ్యక్తి విశ్వక్ సేన్ అనే విషయం అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా సుధీర్ మాట్లాడుతూ ‘ఆ అమ్మాయి మీరేనా అన్నా..ఇంత అందంగా ఉన్నారేంటి ఆ గెటప్ లో ‘ అని అడుగుతాడు. దానికి విశ్వక్ సేన్ సమాధానం చెప్తూ ‘అంత బాగున్నానా?, చూడడం దగ్గరే ఆపేయ్, అంతకు మించి ముందుకు వెళ్ళకు’ అంటూ కౌంటర్ వేస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే విశ్వక్ సేన్ నందమూరి ఫ్యామిలీ హీరోలకు వీరాభిమాని అనే సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాలలో తెలిపాడు. అయితే ‘ఫ్యామిలీ స్టార్స్’ షోలో విశ్వక్ సేన్ ని సుధీర్ ఇరుకున పారేసే ప్రశ్న ఒకటి అడిగాడు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడుగుతాడు. దానికి విశ్వక్ సేన్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతావేంట్రా బాబు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ పెడుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది ఏమిటి అనేది షో చూసి తెలుసుకోవాల్సిందే. అసలే బాలయ్య, ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని మీడియా లో ఎప్పటి నుండో ఒక ప్రచారం సాగుతుంది. ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో విశ్వక్ సేన్ ఎవరివైపు మొగ్గు చూపిస్తాడు అనేది పెద్ద ప్రశ్న. ఇకపోతే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగనుంది, ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు.