https://oktelugu.com/

Director B. Gopal: అప్పటి ముచ్చట్లు : ఆ తింగరి గోపాలమే.. నేడు తిరుగులేని డైరెక్టర్ అయ్యాడు

Director B. Gopal: ‘నేడే చూడండి. మీ అభిమాన పౌరాణిక చిత్రం ’లవకుశ’ అంటూ మైక్‌ లో చెబుతూ పోతున్నారు. అప్పట్లో రిక్షాల పై ఇలా సినిమా ప్రచారాలు చేసేవారు. ఆ రిక్షా వైపే ఆశగా చూస్తూ నిలబడ్డాడు గోపాలం. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా చూడటానికి పిల్లలందరూ పోటీ పడేవాళ్లు. అందులో గోపాలం అయితే మరీనూ. గోపాలానికి పెద్దగా చదువు రాదు. అందుకే, ఆ సినిమా రిక్షా ఊర్లోంచి వెళ్లేవరకూ దాని వెనుకే పరుగెడుతుండేవాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : July 7, 2022 / 05:55 PM IST
    Follow us on

    Director B. Gopal: ‘నేడే చూడండి. మీ అభిమాన పౌరాణిక చిత్రం ’లవకుశ’ అంటూ మైక్‌ లో చెబుతూ పోతున్నారు. అప్పట్లో రిక్షాల పై ఇలా సినిమా ప్రచారాలు చేసేవారు. ఆ రిక్షా వైపే ఆశగా చూస్తూ నిలబడ్డాడు గోపాలం. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా చూడటానికి పిల్లలందరూ పోటీ పడేవాళ్లు. అందులో గోపాలం అయితే మరీనూ.

    Director B. Gopal

    గోపాలానికి పెద్దగా చదువు రాదు. అందుకే, ఆ సినిమా రిక్షా ఊర్లోంచి వెళ్లేవరకూ దాని వెనుకే పరుగెడుతుండేవాడు. గోపాలం గురించి తోటి పిల్లలు కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవారు. కానీ.. వారికేమి తెలుసు ?, ఆ గోపాలమే.. గొప్ప స్టార్ మేకర్ అవుతాడని. ఎంతసేపూ ‘గోపాలానికి చదువు తక్కువ, షోకులెక్కువ’ అని అందరూ ఆట పట్టించే వారే తప్ప.. గోపాలం మనసు అర్థం చేసుకునేది ఎవరు !.

    Also Read: Ram Charan- Shankar: ‘చరణ్ – శంకర్’ సినిమా టైటిల్ ఫిక్స్.. హాలీవుడ్ టెక్నీషియన్స్ వచ్చేశారు

    కానీ.. గోపాలానికి మాత్రం చదువు కంటే.. సినిమాల పై ఇష్టం ఎక్కువ. అయితే, గోపాలం పొట్టోడు, పైగా నల్లగా ఉంటాడు. హీరోగా పనికిరాడు, నటుడిగా కూడా గొప్ప టాలెంట్ ఉన్నవాడు కాదు. మరి గోపాలం ఇక సినిమాల్లో ఏమి చేయగలడు ?, ఇదే విషయం గురించి గోపాలం కూడా ఐదేళ్ల పాటు ఆలోచించాడు.

    Director B. Gopal

    చివరకు, తనకు కథలు రాయడం వచ్చు అని గోపాలం నమ్మాడు. మరోపక్క గోపాలం నాన్నగారు రోజూ తిడుతూ ఉండేవారు. కారణం.. గోపాలానికి మార్కులు ఎక్కువ వచ్చేవి కాదు. లెక్కల్లో సున్నలే. అయితే ఏమి ? గోపాలానికి తెలుసు. తాను సినిమాల్లో గొప్పగా రాణిస్తాను అని. అదే మాట వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పాడు. దెబ్బకు గోపాలం వీపు వాచిపోయింది.

    Director B. Gopal

    ఇక లాభం లేదు, తాను సినిమాల్లో రాణించాలి అంటే.. ఒక పెద్ద తలకాయ కావాల్సిందే అనుకున్నాడు. ఎవరు ఆ పెద్దాయన ?, ఠక్కున దాసరి అనే పేరు గుర్తుకు వచ్చింది. ఎలాగోలా గోపాలం దాసరి గారి దయతో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. ఎన్నో అవమానాలు, మరెన్నో బాధలు. జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది, అనే ఆలోచనల మధ్యన గోపాలం స్టార్ డైరెక్టర్ అయ్యాడు. నేడు బి. గోపాల్ గా తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నాడు. చిన్నతనంలో బి.గోపాల్ ను గోపాలం అని పిలిచేవారట.

    Also Read:NTR Apologized Star Heroine: ప్రముఖ స్టార్ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. కారణం ఏంటో తెలుసా?

    Tags